lottery: మెకానిక్ అదృష్టం.. లాటరీలో రూ.25 కోట్లు డ్రా
lottery: మెకానిక్ అదృష్టం.. లాటరీలో రూ.25 కోట్లు డ్రా
ఓనం బంపర్ డ్రాలో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ కు రూ.25 కోట్లు..
రెండో బహుమతి కింద రూ.2 కోట్లు..
మూడో బహుమతి కింద రూ.50 లక్షలు..
15 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్నా.. ఇప్పుడు అదృష్టం వరించి..
lottery : ఓ మెకానిక్ అదృష్టం వరించింది. కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ కేరళలో ఓనం సందర్భంగా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ తో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పాండవపురానికి చెందిన అల్తాఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ కొంటున్నాడు. కానీ ఎప్పుడూ ఎప్పుడు లాటరీ తగలలేదూ. అయితే ఓనం సందర్భంగా కేరళలో ఉన్న తన స్నేహితుడు ఎస్జే ఏజెన్సీ వద్ద అల్తాఫ్ పేరు మీద ఒక టికెట్ ను కొన్నాడు.
తాజాగా తీసిన లాటరీ డ్రా విజేతలను ప్రకటించారు. అందులో అల్తాఫ్ కొన్న టికెట్ నంబర్ TG43222కి మొదటి బహుమతి వచ్చిందని వెల్లడించారు. లాటరీ ద్వారా వచ్చిన నగదును తన ఇంటి నిర్మాణానికి ఖర్చు చేస్తానని అల్తాఫ్ తెలిపాడు. అలాగే తన కుమార్తె పెళ్లికి ఉపయోగిస్తానని చెప్పాడు. ఈ డ్రాలో మరో ఇరవై మందికి రెండో బహుమతి కింద ఒక్కొక్కరికి రూ.2కోట్లు బహుమతి గెలుచుకున్నారు. మూడో బహుమతి కింద 20 మందికి రూ.50 లక్షలు చొప్పున గెలుచుకున్నారు. మొత్తం 71 లక్షల పైగానే టికెట్లు అమ్ముడైనట్లు కేరళ లాటరీ డైరెక్టర్ అబ్రహం తెలిపారు. పాలక్కడ్ లో అత్యధికంగా టికెట్లు అమ్మడయ్యాయని వెల్లడించారు.
స్క్రాప్ డీలర్లకు అదృష్టం!
రూ.500తో కొన్న లాటరీ టికెట్ కోటీశ్వరుడిని చేసింది. ఇటీవల పంజాబ్ కు చెందిన ఓ స్క్రాప్ డీలర్లను అదృష్టం వరించింది. రాఖీ సందర్భంగా కొన్న లాటరీ టికెట్ ద్వారా ఏకంగా రూ. 2.5 కోట్లు గెలుచుకున్నారు. జలంధర్ జిల్లాలోని ఆదమ్పుర్ కు చెందిన ప్రీతమ్ లాల్ జగ్గీ (67) స్క్రాప్ డీలర్ గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఆయనకు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. రాఖీ సందర్భంగా రూ.500తో ఓ లాటరీ టికెట్ ను తన భార్య అనీతా జగ్గీ పేరు మీద కొన్నారు. ఈసారి ఆయన్ను అదృష్టం వరించి రూ.2.5 కోట్లు గెలుచుకున్నారు. అయితే ముందుగా తన నంబర్ లాటరీ 452749 నంబర్ ను న్యూస్ పేపర్లో చూసి నమ్మలేదని, లాటరీ ఏజెంట్ ఫోన్ చేస్తే నమ్మకం కలిగిందని జగ్గీ చెబుతున్నారు.