LHMS: దసరా పండగ సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
LHMS: దసరా పండగ సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
• LHMS యాప్ ను ఉపయోగిద్దాం ... ఇళ్ళ దొంగతనాలను అరికడదాం.
• LHMS యాప్ సేవలు ప్రజలకు ఉచితం.
• LHMS యాప్ ద్వారా లేదా 9121101075 నంబర్ కు లేదా స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
• దొంగతనాలు అరికట్టడానికి జిల్లా ప్రజలు సహాకరించాలి..
- జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
దసరా పండుగ కు ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సోమవారం జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు " లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం" సేవలు సద్వినియోగం చేసుకుని నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకుని రాత్రి , పగలు కన్నపు నేరాలకు పాల్పడుతున్న దొంగలను నివారించడానికి ఈ LHMS యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
దొంగతనాలకు పాల్పడితే ఈ యాప్ తో పసిగడతారనే భయాన్ని దొంగల్లో కలిగించడానికి ఈ యాప్ ను వినియోగంలోకి తీసుకురావడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఉచితంగా ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ సేవలుఅందుబాటులో ఉంటాయన్నారు.
ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఎల్.హెచ్.ఎం.ఎస్. (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
డబ్బు మరియు విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్ళకూడదన్నారు. ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవాలన్నారు. రాత్రివేళ అనుమానంగా సంచరించేవారి గురించి, తాళం వేసిన ఇండ్ల వద్ద అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు.
LHMS యాప్ ను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి...
గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి LHMS AP POLICE యాప్ అని టైప్ చేసి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోని, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన వారు ముందుగా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అనే యాప్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి.
యాప్ ను ఓపెన్ చేయగానే రిజిస్టర్, రిక్వెస్ట్ పోలీస్ వాచ్ అనే రెండు ఆప్సన్లు కనిపిస్తాయి.
ముందుగా రిజిస్టర్ ఎంచుకోవాలి. అక్కడ పేరుతో పాటు, అడ్రస్, సెల్ నంబర్ నమోదు చేయాలి.
మై లోకేషన్ ఆప్సన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇంటి లోకేషన్ గూగుల్ మ్యాప్ ద్వారా అందులో ఎంట్రీ చేయాలి. ఇదంతా ఇంటిలో కూర్చొనే చేయవచ్చు. అత్యవసర సమయాల్లో, యాత్రలు, ఇతర ఊర్లకు వెళ్లినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు కాపలాగా సీసీ కెమెరా లను ఏర్పాటు చేస్తారు.
ఒక వేళ దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టుకునే అవకాశం ఉందన్నారు.
ఎల్ హెచ్ ఎం ఎస్ సేవలను ఉపయోగించుకొని ఇళ్లలోని విలువైన వస్తు వులకు రక్షణ కల్పించుకోవాలి.
ప్రజలు సహకరిస్తే దొంగతనాలను ఆరికట్టడమే కాక, దొంగల ఆటలను సులువుగా కట్టించవచ్చని ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.