-Advertisement-

Journalist: ప్రభుత్వంపై విమర్శలు చేసే జర్నలిస్టుల పై కేసులు పెట్టొద్దు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Journalist: ప్రభుత్వంపై విమర్శలు చేసే జర్నలిస్టుల పై కేసులు పెట్టొద్దు

• ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు...

• ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి...

• జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్య...

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వంపై జర్నలిస్టులు చేసే విమర్శలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై  న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్పీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించారు.

ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి...

ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తారని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జర్నలిస్టులు రాసే కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి.. సదరు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని న్యాయస్థానం సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఓ వార్తా కథనం ప్రచురించినందుకు...

కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్ట్ అభిషేఖ్ ఉపాధ్యాయ్పై ఎఫ్ఎఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఎఆర్ ను సవాల్ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జర్నలిస్ట్ అభిషేఖ్ ఉపాధ్యాయ్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Comments

-Advertisement-