Health Tips: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలు తప్పనిసరి
Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle
Health care news
Health information news Telugu
By
Janu
Health Tips: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలు తప్పనిసరి
- శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది...
- మనిషి తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకలే కారణం...
- ఎముకలు బలహీనపడితే విరిగిపోతయి...
- కాబట్టి అవి దృఢంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి...
శరీరం మొత్తం ఎముకలపై ఆధారపడివుంటుంది. మనిషి చురుగ్గా ఉన్నాడంటే.. తేలికగా కదులుతున్నాడంటే అందుకు ఎముకల బలంగా ఉండాలి. వయసు పైబడిన కొద్దీ ఎముకల్లో బలం తగ్గతూ వస్తుంది. ముఖ్యంగా మహిళలలో ఎముకల అరుగుదళ ఎక్కువగా ఉంటుంది. ఎముక గట్టిగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎముకలు బలహీనపడితే విరిగిపోతాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కింద తెలిపిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తినాలి. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు కర్రీలో నువ్వులను వేసుకుని తినొచ్చు. అయితే ఎక్కువగా నువ్వులు తింటే వేడి చేసే అవకాశం ఉంటుంది. సోయాబీన్ లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి మీరు తరచూ సోయాబీన్ ను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు తమ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పైన చెప్పిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. బచ్చలికూర, ఆవాలు, మెంతులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియంతో పాటు అదనంగా విటమిన్ A, C, Kలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మీరు వాటిని సలాడ్లో తినవచ్చు. లేదా వండుకుని తినొచ్చు.
పాలు, పెరుగు, జున్ను, మజ్జిగలో కాల్షియం ఉంటుంది. వీటిలో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో కనీసం ఒకటి లేదా రెండు పాలఉత్పత్తులను చేర్చడానికి ప్రయత్నించండి.
పప్పులు, బీన్స్ లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని వారంలో కనీసం రెండు మూడు సార్లు తింటే ఎముకలు బలంగా ఉంటాయి.
Comments