Health tips: సీతాఫలం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు తెలుసా!!
Health tips: సీతాఫలం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు తెలుసా!!
ప్రతి ఏడాది మనకు శీతాకాలం ప్రారంభం నుంచే సీతాఫలాలు లభిస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా మనకు సీతాఫలాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండ్లను మనం ఎక్కువగా చూడవచ్చు. సీతాఫలాలు కేవలం ఈ సీజన్‌లోనే లభిస్తాయి. కనుక ఎవరైనా సరే ఈ పండ్లను మిస్ అవకుండా తినాల్సిందే..
ప్రతి ఏడాది మనకు శీతాకాలం ప్రారంభం నుంచే సీతాఫలాలు లభిస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా మనకు సీతాఫలాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండ్లను మనం ఎక్కువగా చూడవచ్చు. సీతాఫలాలు కేవలం ఈ సీజన్‌లోనే లభిస్తాయి. కనుక ఎవరైనా సరే ఈ పండ్లను మిస్ అవకుండా తినాల్సిందే. ఈ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. సీతాఫలాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి సీతాఫలాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. రోజుకు ఒక పండును తింటే చాలు సుఖంగా విరేచనం అవుతుంది.
సీతాఫలాల్లో పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. దీని వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు ఈ పండ్లను తినాల్సి ఉంటుంది. వీటిల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కనుక షుగర్ ఉన్నవారు అధికంగా ఈ పండ్లను తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తినే విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహాను పాటించాల్సి ఉంటుంది. ఇలా సీతాఫలం పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఈ రోగాలు దరిచేరవు...
ఈ పండ్లను తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయట పడవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, ఫినోలిక్ సమ్మేళనాలు, కారెనోయిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ఇక ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను సంరక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి జరగకుండా చూస్తాయి. దీంతో వయస్సు మీద పడిన తరువాత కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి.
ఆందోళన, ఒత్తిడి నుంచి బయట పడేలా చేస్తుంది..
సీతాఫలం పండ్లను తినడం వల్ల విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సీతాఫలాల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఇది మూడ్‌ను మారుస్తుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి నుంచి బయట పడేలా చేస్తుంది. మూడ్ బాగా లేనప్పుడు ఒక సీతాఫలం పండును తింటే చాలు, వెంటనే ఉత్సాహంగా మారిపోతారు చురుగ్గా పనిచేస్తారు.