Haryana CM: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
Haryana CM: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం- వరుసగా రెండోసారి బాధ్యతలు..
నాయబ్ సింగ్ సైనీతో పాటు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం..
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు..
Haryana CM: హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి నాయబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
నాయబ్ సింగ్ సైనీతో పాటు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సైనీ, మంత్రులుగా ప్రమాణ చేసిన వారితో కలిసి ప్రధాని మోదీ ఫొటో దిగారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు నాయబ్ సింగ్ సైనీ పంచకులలోని వాల్మీకి, మాసన దేవీ ఆలయంలో పూజాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయత్వంలో గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం సమవర్ధవంతగా పని చేసిందన్నారు. మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో మేము ప్రధానితో కలిసి పని చేసి హరియాణాను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.