Gold Price: ఆకాశానికి తాకుతున్న బంగారం ధరలు.. ధరలు పెరగడానికి కారణాలు అవేనా
Gold Price: ఆకాశానికి తాకుతున్న బంగారం ధరలు.. ధరలు పెరగడానికి కారణాలు అవేనా
Gold Price: బంగారం ధరలు రాకెట్‌వేగంతో దూసుకుపోతున్నాయి. దేశీయంగా పండుగ సీజన్ కావడంతో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది.
ముఖ్యంగా గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో గోల్డ్ ధర 80 వేల మార్క్ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400 పెరిగి.. రూ.73,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి.. రూ.80,070గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర 80 వేలు మార్క్ దాటేయగా.. సిల్వర్ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష మార్క్ దాటేసి.. పరుగులు పెడుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రెండు వేలు పెరిగి.. లక్షా నాలుగు వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి లక్షా పన్నెండు వేలుగా నమోదైంది. బెంగళూరులో మాత్రం 99 వేలుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఆకాశానికి వెండి రేటు..
గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి సోమవారం మరో ఉన్నత శిఖరాలపైన ముగిసింది. నాణేల తయారీదారులతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.5,000 అధికమై చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం కూడా ఇదేతొలిసారి కావడం విశేషం. గత శుక్రవారం రూ.94,500గా ఉన్న కిలో ధర సోమవారానికి రూ.99,500కి చేరుకున్నది. త్వరలో లక్ష రూపాయలకు చేరుకునే అవకాశాలున్నాయని ట్రేడర్లు వెల్లడిస్తున్నారు.
తగ్గనున్న కొనుగోళ్లు..
రికార్డు స్థాయికి చేరుకోవడంతో పసిడి, వెండి అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉన్నదని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడికి ఇప్పటికే దూరమైన బంగారం, భవిష్యత్తులో ఇదే ట్రెండ్‌లో దూసుకుపోతే మాత్రం లగ్జరీ వాళ్లు కూడా వెనుకంజవేసే అవకాశం ఉన్నదన్నారు. పసిడి వినిమయంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ ప్రతియేటా 800-900 టన్నుల మేర పుత్తడిని దిగుమతి చేసుకుంటున్నది. ఈసారి బడ్జెట్‌లో పుత్తడిపై సుంకాన్ని తగ్గిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బంగారం ధరలు 7 శాతం వరకు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,735.30 డాలర్లు పలకగా, వెండి 34 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
ధరలు పెరగడానికి కారణాలు..
సైప్లె-డిమాండ్‌ల మధ్య అంతరం పెరగడంతోపాటు గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, రీైస్లెకింగ్ రేట్లు అధికమవడం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం దేశ, విదేశాల్లో పసిడి నిల్వలు పెద్ద ఎత్తున పెంచుకుంటున్న సెంట్రల్ బ్యాంక్‌లు. ద్రవ్యోల్బణం పరిస్థితులూ మార్కెట్లో ధరల్ని ఎగదోస్తున్నాయి. పలు దేశాల కరెన్సీలు బలోపేతం కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనడం. చైనా వడ్డీరేట్లను పావుశాతం తగ్గించడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం.