Ghee: కల్తీ నెయ్యిని గుర్తించండి ఇలా..!
Ghee: కల్తీ నెయ్యిని గుర్తించండి ఇలా..!
అసలు కంటే నకిలీలే ఆకట్టుకుంటున్న కాలమిది. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో కల్తీ సరుకు మార్కెట్ని ఏలుతున్నది. ఇలా కల్తీ కాటుకు గురైన పదార్థాల్లో నెయ్యి ఒకటి. ముద్దపప్పు రుచిని మూడింతలు పెంచే నెయ్యి కల్తీదైతే..
అసలు కంటే నకిలీలే ఆకట్టుకుంటున్న కాలమిది. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో క సరుకు మార్కెట్ని ఏలుతున్నది. ఇలా కల్తీ కాటుకు గురైన పదార్థాల్లో నెయ్యి ఒకటి.
ముద్దపప్పు రుచిని మూడింతలు పెంచే నెయ్యి కల్తీదైతే.. రుచి మాట దేవుడెరుగు, ఆరోగ్యానికి ముప్పు తప్పదు. చిన్నపిల్లలు నెయ్యి లేకుండా ముద్ద ముట్టరు. అలాంటి పసిపాపలకు కల్తీ నెయ్యితో గోరుముద్దలు తినిపిస్తే.. ఎంత ప్రమాదం. అందుకే, నెయ్యి తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. నెయ్యి స్వచ్ఛతను పరీక్షించాలంటే ఈ సూత్రాలు పాటించండి.
నీటి పరీక్ష:-
ఒక గాజు గ్లాసులో నీళ్లను నింప అందులో చిన్న నేతి ముద్దను వేయండి. అది నీటిపై తేలితే అస్లీ.. నీట మునిగితే కల్తీ జరిగినట్టే వేడి పరీక్ష: ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి. దాన్ని ఒక గాజు గ్లాసులో పోయాలి. నెయ్యి వేడి కొద్దిగా తగ్గిన తర్వాత గ్లాసును ఫ్రిజ్లో పెట్టాలి. నెయ్యి గడ్డకట్టిన తర్వాత చూస్తే అంతా ఒకే తీరుగ ఉంటే కల్తీ లేనట్టు. అట్లా కాకుండా పైన ఒక పొరలా ఏర్పడితే ఆ నెయ్యిలో ఏవో నూనెలు కలిపారని గుర్తించాలి.
అయోడిన్ పరీక్ష:-
ఒక గిన్నెలో కొంత నెయ్యితీ సుకోవాలి. అందులో కొన్ని చుక్కలు అయోడిన్ వేసి కలపాలి. నెయ్యి రంగు మారితే కల్తీ జరిగినట్టు. రంగు మారకపోతే అది అసలైన నెయ్యి. నెయ్యిని పిండితో కల్తీ చేస్తే అయోడిన్ పరీక్షలో అది నీలం రంగులోకి మారుతుంది.
చేతి పరీక్ష:-
నేతి ముద్ద కొంచెం చేతిలో వేసుకున్నాక, ఏటవాలుగా చేతిని వంచండి. శరీరం వేడికి నెయ్యి నెమ్మదిగా కరుగుతూ కిందికి జారిపోతుంది. కల్తీ జరిగితే కరిగిపోకుండా చేతిపైనే మిగిలి ఉంటుంది.
ఆమ్ల పరీక్ష:-
ఒక టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో హైడ్రో క్లోరిక్ ఆమ్లం చుక్కల కొన్ని వేయాలి. ఆ రెంటినీ కలిపితే నెయ్యి రంగు మారకపోతే స్వచ్ఛమైన నెయ్యిగా భావించొచ్చుకల్తీ జరిగితే రంగు మారుతుంది.