Dasara: దసరా ఎందుకు జరుపుకుంటాం? దసరా విశిష్టత ఏమిటి?
Dasara: దసరా ఎందుకు జరుపుకుంటాం? దసరా విశిష్టత ఏమిటి?
విజయాలకు నాంది విజయదశమి
కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం
పండుగలు సంప్రదాయానికి చిహ్నాలు..
పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. పండుగ పది గండాలు పోగొడుతుంటారు. అందుకే మనకు ఉన్నంతలో పండుగ చేసుకోవాలి. మన పిల్లలకు మన పండుగల గొప్ప తనాన్ని తెలియజేయాలి. మన సాంప్రదాయ విలువలను మన భావితరాలకు భద్రంగా అందించాలి. మనమందరం కూడా విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఆ విజయదుర్గ అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం. శ్రీమాత్రేనమః
విజయదశమి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ. ఉత్తర భారతంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాధ ఏమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి రోజున శ్రీరాముడు లంకాపతి రావణుని సంహరించాడు. ఇది కాకుండా, విజయదశమి పండుగ దుర్గమాతతో కూడా ముడిపడి ఉంటుంది. ఈ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విన్ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణ దహనం జరుగుతుంది. అలాగే ఆయుధాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున రావణ దహనం, ఆయుధ పూజల గురించిజమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు..
విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం..
ఇక మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయా జూదంలో పరాజయం పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సివచ్చింది. అప్పుడు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించేముందు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాచి ఉంచారు. తిరిగి సంవత్సరం తరువాత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తిరిగి తీసుకున్నదే ఈ విజయదశమి రోజునే! అందుకే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు.