Cyber Crime: రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్ పలు అంశాలపై జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు...
Cyber Crime: రోడ్డు ప్రమాదాలు,సైబర్ క్రైమ్ పలు అంశాలపై జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు...
నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ,CC కెమెరాల ప్రాముఖ్యత ,సైబర్ క్రైమ్ నేరాలపై, మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీస్ అధికారులు..
నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాలమేరకు ఈరోజు 10-10-2024వ తేదీ నంద్యాల జిల్లాలోని డోన్ సబ్ డివిజన్ నందు శింగనపల్లి, ఊటకొండ ,పెద్దపుదిల్లి. ఆత్మకూరు సబ్ డివిజన్ లోని ఇస్కాల, ప్రాతకోట. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని పెట్నికోట. నంద్యాల సబ్ డివిజన్ లోని కొత్తపల్లి ,శింగవరం. మొదలగు గ్రామాలలో సంబంధిత పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంతరణ, CC కెమెరాల ప్రాముఖ్యత, నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే నేరాలు వాటి నియంత్రణ మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
➡️ ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని పోలీసు అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలావరకు అతివేగం వలన అజాగ్రత్త వలన జరుగుతుంటాయని కావున యువత ఏదైనా వాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని మరియు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు.అతివేగం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబం నష్టపోవడం మాత్రమే కాకుండా ఎదుటివారి ప్రమాదం జరగడం వలన వారి కుటుంబం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.మోటర్ సైకిల్ పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు అని మరియు అతివేగంగా మోటార్ సైకిల్ పై వెళ్లకూడదని, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు (మైనర్) వాహనాలు ఇవ్వడం వలన వారు ప్రమాదానికి గురి కావడంతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కావున చిన్న పిల్లలకి వాహనం నడిపే అవకాశం ఇవ్వకూడదని కొన్ని సూచనలు తెలియజేశారు.
➡️ నేర నియంత్రణలో భాగంగా ప్రాపర్టీ నేరాలు జరగకుండా నివారణ చర్యలలో భాగంగా షాప్ ల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగతనాల నివారణ మరియు ఏదైనా ఇతర సంఘటనలు జరిగినప్పుడు సులువుగా ముద్దాయిలను కనుగొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు, మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండుటకు షాప్ యజమానులు తమ వస్తువులను రోడ్డుపై ఉంచకుండా మరియు వినియోగదారులు తమ షాపులకు వచ్చినప్పుడు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
➡️ ఓవర్ లోడుతో ప్రయాణం చేయకూడదని ముఖ్యంగా ఆటోలలో పరిమితికిమించి ప్రయాణం చేయడం వలన ప్రమాదాలు జరగవచ్చునని కావున ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని విజ్ఞప్తి చేశారు. మరియు వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని కావున సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని విజ్ఞప్తి చేశారు.
➡️ సైబర్ క్రైమ్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు వార్తాపత్రికల ద్వారా, పాఠశాలలో కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మరియు వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు సైబర్ నేరాల నియంతరణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ చాలామంది ప్రజలు అత్యాశకు వెళ్లి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడడం కావున తెలియని వ్యక్తుల వద్ద నుండి వచ్చే ఫోన్ కాల్స్ ,లింక్ లపై అప్రమత్తంగా ఉండాలని, మరియు మీయొక్క బ్యాంకు సంబంధించిన పాస్వర్డ్ ఓ.టి.పి మొదలగునవి ఎవరితోను పంచుకోరాదని, ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే వెంటనే 1930 కు సమాచారం అందించిన ఎడల బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు.