Cyber Alert: ప్రీ గిఫ్ట్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండండి..
Cyber Alert: ప్రీ గిఫ్ట్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండండి..
• సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దు.
జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS
టెక్నాలజీ రంగములో ప్రస్తుతం ప్రపంచం దూసుకుపోతున్న సంధర్భంలో దీన్ని అదునుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కావున ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని మరియు సరియైన అవగాహన కలిగి ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS తెలియజేశారు.సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చెయ్యాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను( దసరా,దీపావళి) పండుగలను దృష్టిలో పెట్టుకొని ప్రీ గిఫ్ట్ అంటూ మోసం చేసే అవకాశం ఉంది.కాబట్టి వాటికి ఆశపడి ఆకర్షితులైతే సైబర్ నేరగాళ్ల చేతిలో పడి నిలువుదోపిడికి గురయ్యే అవకాశం ఉందని, డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడాలని మరియు పాన్‌కార్డు నంబర్,ఆదార్ నంబర్ అప్‌డేట్ పేరిట చేస్తున్నమోసాల గురించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.
➡️ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS మాట్లాడుతూ తెలియని మొబైల్ నంబర్స్ నుండి మీ బ్యాంకు అకౌంట్ లేదా యోనో అకౌంట్ బ్లాకైందని, మీ పాన్‌కార్డు నంబర్,ఆధార్ నంబర్ అప్‌డేట్ చేసుకొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి' అని సందేశాలు వచ్చినప్పుడు జాగ్రతగా ఉండండి.
➡️ప్రత్యేకమైన సందర్భాలను పండుగలను దృష్టిలో పెట్టుకొని ప్రీ గిఫ్ట్ అంటూ మెసేజ్ లు వచ్చినప్పుడు,మోసపూరిత లోన్ యాప్ ల గురించి,మోసపూరిత ఉధ్యోగ ప్రకటనలు మొదలగు మెసేజ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి, మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా నంబర్లు, పాస్‌వార్డులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లు వాటి సహాయంతో మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును మీకు తెలియకుండానే దొంగిలిస్తారన్నారు.
➡️తెలియని మొబైల్ నెంబర్ ల నుండి వచ్చే లింక్ లను ఎట్టిపరిస్థితులలో క్లిక్ చెయ్యవద్దన్నారు. ఎవరితోనూ మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దన్నారు. అలాగే గూగుల్ నోటిఫికేషన్ ద్వారా వచ్చే క్యాష్ రివార్డులు, స్క్రాచ్ కార్డ్ లని నమ్మవద్దన్నారు.
➡️ఎవరైనా కాల్ చేసి మీకు లోన్ శాంక్షన్ అయింది లోన్ అమౌంట్ పొందాలి అంటే కొన్ని రకాల ఫీజు చెల్లించాలి అంటే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు గ్రహించాలన్నారు. సైబర్ నేరానికి గురైన తరువాత భాదపడేకంటే, ముందు నుంచి ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తం ఉండాలనే ఉద్దేశంతో సైబర్ మోసాల గురించి హెచ్చరిస్తున్నామన్నారు.
➡️మీ వాట్స్ యాప్ లకు తెలియని నంబర్ ల ద్వారా కాల్స్ మరియు మెసేజ్ లు,లింక్ లు వచ్చినపుడు అప్రమత్తతో వ్యవహరించండి. మిమ్మల్ని చిన్న వాట్స్ యాప్ మెసేజ్ మరియు కాల్స్ ద్వారా సంప్రదిస్తారు.పార్ట్‌టైం జాబ్ చేస్తారా? అని అడిగి వాళ్లు పంపిన లింక్‌లో అకౌంట్ క్రియేట్ చేయిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం నామమాత్రపు ఛార్జీలు అడుగుతారు అనంతరం మీ వ్యక్తిగత సమాచారం వారివద్ద భద్రపరుచుకొని ఇతర నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ హెచ్చరించించారు.