CRS APP: బర్త్, డెత్ సర్టిఫికెట్స్ CRS యాప్ లో ఇలా అప్లై చేసుకోండి.. పూర్తి సమాచారం
CRS APP: బర్త్, డెత్ సర్టిఫికెట్స్ CRS యాప్ లో ఇలా అప్లై చేసుకోండి.. పూర్తి సమాచారం
• జనన మరణాల నమోదు కోసం యాప్ ను ఆవిష్కరించిన కేంద్రం...
• CRS లో సులభంగా ధ్రువీకరణ పత్రాల డౌన్లోడ్..
• యాప్ ను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అవాంతరాలు లేకుండా కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా జనన మరణాలను నమోదు చేయడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్) పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం దీనిని రూపొందించింది. ఆ యాప్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఆవిష్కరించారు. అయితే CRS మొబైల్ అప్లికేషన్ దరఖాస్తు సమయాన్ని బాగా తగ్గిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు అమిత్ షా.
తమ పాలనకు సాంకేతికతను అనుసంధానం చేసే క్రమంలో డిజిటల్ ఇండియా థ్యేయంతో కేంద్ర ప్రభుత్వం సీఆర్ఎస్ యాప్ ను తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అదే సమయంలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్ ఇంటర్ఫేస్ ను పరిచయం చేశారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
యాప్ ఎలా ఉపయోగించాలి?
- ముందుగా గూగుల్ ప్లేస్ స్టోర్ నుంచి CRS యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి
- ఇన్స్టాల్ చేసుకున్నాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి
- క్యాప్చా బాక్స్ను ఫిల్ చేశాక రిజిస్టర్ట్ మెబైల్ నంబర్కు ఓటీపీ వెళ్తుంది
- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి హోమ్ పేజీ అవుతుంది
- ఎడుమ వైపు ఉన్న సింబల్పై క్లిక్ చేస్తే మెనూ చూపిస్తుంది
- అందులో బర్త్, డెత్, ప్రొఫైల్ సహా పలు ఆప్షన్స్ ఉంటాయి
- జనన వివరాలను నమోదు చేయడానికి బర్త్ రిజిస్టర్పై క్లిక్ చేయాలి
- పుట్టిన తేదీ, చిరునామా సహా పలు వివరాలను పూరించాలి
- నిర్ణీత రుసుము చెల్లించాక దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది
- ఆ తర్వాత జనన ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు
- డెత్ సర్టిఫికెట్ కోసం కూడా రిజిస్టర్ డెత్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇదే పద్దతిని అనుసరిస్తే సరిపోతుంది.
గమనిక:
కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన చేసిన CRS యాప్ ప్రస్తుతం ఇంటర్నెల్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో పూర్తి స్థాయి అప్డేట్తో అందరికీ అందుబాటులోకి రానుంది!