-Advertisement-

BSNL: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం..స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలపై ఇలా ఫిర్యాదు చేయండి?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET BSNL New Plans BSNL recharge
Peoples Motivation

BSNL: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం..స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలపై ఇలా ఫిర్యాదు చేయండి?

• అనవసర, యూసీసీ కాల్స్ నుంచి బయటపడే మార్గం...

• స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదు చేసే ఆప్షన్ తీసుకొచ్చిన BSNL...

• దేశంలో ఇప్పటి వరకు మరే సంస్థ ఈ ఆప్షన్‌ను తీసుకురాని వైనం...

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET BSNL New Plans BSNL recharge

ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇటీవల కాలంలో సంచలన నిర్ణయాలతో వేగంగా వినియోగదారులకు చేరువ వుతుంది. ప్రైవేటు టెలికం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ)కి ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇటీవలి కాలంలో గట్టి పోటీ ఇస్తోంది. ఆ సంస్థలు తమ టారిఫ్ ధరలను ఎడాపెడా పెంచేయడంతో ఖాతాదారులు ఇప్పుడు BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ సంస్థ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పాత వినియోగదారులు సైతం నంబర్ పోర్టబిలిటీ ద్వారా BSNLకు మారుతున్నారు. 

అతి త్వరలోనే BSNL 5జీ సేవలు...

అతి త్వరలోనే BSNL నుంచి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. BSNL తాజాగా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకనలు (యూసీసీ)పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌పై BSNL వినియోగదారులకు ఇప్పుడు సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయాన్ని దేశంలోని మరే టెలికం సంస్థ అందుబాటులోకి తీసుకురాలేదు.  

సెల్ఫ్‌కేర్ యాప్‌ లో ఎలా ఫిర్యాదు చేయాలి..?

తొలుత BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. హోంపేజీలో పైన ఎడమవైపు ఉన్న మూడు లైన్లపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రోల్ చేస్తూ కిందికి వస్తే ‘కంప్లైంట్ అండ్ ఫ్రిఫరెన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కుడివైపున ఉన్న మూడు గీతలపై క్లిక్ చేస్తే చూజ్ ‘కంప్లైంట్స్’ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ‘న్యూ కంప్లైంట్’పై క్లిక్ చేయాలి. అందులో మనం వాయిస్ ద్వారా కానీ, లేదంటే ఎస్సెమ్మెస్ ద్వారా కానీ కంప్లైంట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనకు అనుకూలంగా ఉన్న దానిపై కంప్లైంట్ చేస్తే సరి.  

Comments

-Advertisement-