-Advertisement-

డిగ్రీ అర్హతతో BoMలో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..అప్లై చేసుకోండిలా!!

Latest Govt Jobs notifications Government Jobs after 12th Govt Jobs 2024 Central Government Jobs List Govt Jobs 2024 in AP AP Govt Jobs Direct recruit
Peoples Motivation

Bank Jobs: డిగ్రీ అర్హతతో BoMలో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..అప్లై చేసుకోండిలా!!

బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Latest Govt Jobs notifications Government Jobs after 12th Govt Jobs 2024 Central Government Jobs List Govt Jobs 2024 in AP AP Govt Jobs Direct recruitment in AP Govt Jobs Government jobs in India

ముఖ్యమైన సమాచారం 

కేటగిరీల వారిగా పోస్టుల వివరాలు:-

యూఆర్ - 305 పోస్టులు

ఓబీసీ - 131 పోస్టులు

ఈడబ్ల్యూఎస్ - 51 పోస్టులు

ఎస్టీ - 48 పోస్టులు

ఎస్సీ - 65 పోస్టులు

మొత్తం పోస్టులు - 600

రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు:- ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:- అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:-

అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:-

యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150 + జీఎస్‌టీ చెల్లించాలి.

ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి.

దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:- 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

శిక్షణ వ్యవధి:- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

స్టైపెండ్: శిక్షణ కాలంలో అప్రెంటీస్లకు నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు.

దరఖాస్తు విధానం:-

అభ్యర్థులు ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

కెరీర్స్ సెక్షన్లోకి వెళ్లి అప్రెంటీస్ రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయాలి.

దరఖాస్తు ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.

అవసరమైన అన్ని డ్యాకుమెంట్లు సహా, మీ ఫొటో, సిగ్నేచర్లను అప్లోడ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.

అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.

భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:-

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 2024 అక్టోబర్ 14

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 అక్టోబర్ 24

ముఖ్యాంశాలు:-

600 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 24వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 👇 

https://bankofmaharashtra.in/current-openings

Comments

-Advertisement-