పల్లెకు పండగొచ్చింది,,,!
పల్లెకు పండగొచ్చింది,,,!
గ్రామాల అభివృద్దే లక్ష్యం - పల్లెల్లో పండుగ వాతావరణం
యు కొత్తపల్లి మండలం అక్టోబర్ 17 పీపుల్స్ మోటివేషన్
రాష్ట్రంలో పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాల్లో.. 13,326 గ్రామాల్లో రూ.4,500 కోట్లతో 30 రకాల పనులకు శంకుస్థాపాలు చేయనున్నారు. ఈ పనులన్నీ సంక్రాంతి వరకు పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ఆదేశం అందులో భాగంగా గురువారం ఉదయం మండలంలో పలు సిసి రోడ్లకు మరియు డ్రైనేజీలకు రాజకీయ నాయకులు భూమి పూజ చేశారు. కొత్తపల్లి రవీంద్రపురం .వాకతిప్ప. కుతుకుడుమిల్లి. గొర్స కొమరగిరి కొండవరం నాగులపల్లి ఇలా పలు గ్రామాల్లో పల్లె పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ అయినటువంటి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సిసి రోడ్లకు శంకుస్థాపనలో రాజకీయ నాయకులు చేశారు. అనంతరం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో ప్రజలను నిరాశ పరిచే విధంగా ప్రవర్తించారని గ్రామాలు అభివృద్ధి చెందలేదని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అదేవిధంగా ఈ కొత్త పనులన్నీ సంక్రాంతికి పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపడతామని వారు తెలిపారు. మహాత్మా గాంధీ కలగన్న స్వరాజ్యమని పల్లెలు పట్టుకొమ్మలిని ఆనాడు తెలిపారని అదేవిధంగా ఈనాడు పవన్ కళ్యాణ్ దాన్ని అమలుపరిస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు. తెలగం శెట్టి వెంకటేశ్వరరావు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు మొరాల్ శెట్టి సునీల్ కుమార్. ధన బాబు పలు గ్రామ సర్పంచులు సచివాలయం సిబ్బంది తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు