-Advertisement-

ప్రతి రోజూ మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET Sleeping advantages Sleeping
Priya

ప్రతి రోజూ మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా?

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET Sleeping advantages Sleeping

మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నడుంవాల్చితే ప్రాణానికి ఎంత హాయో! ఆ కాసేపు విశ్రాంతి తర్వాత మెదడు పనిచేసే వేగం పెరగడమే కాదు, బడలిక తీరి శరీరమూ ఉత్తేజితమవుతుంది. అయితే, ఆ నిద్ర పరిమితికి మించితే ఆరోగ్యానికి చేటంటోంది ఓ తాజా అధ్యయనం. మధ్యాహ్నం నిద్ర ఎక్కువైతే స్థూలకాయం రావొచ్చు. అంతేకాదు, రక్తపోటు పెరగడం, శరీరంలో చక్కెర శాతం ఎక్కువ కావడం, నడుముచుట్టూ కొవ్వు చేరడం.. లాంటి పరిణామాలూ తలెత్తుతాయి. మొత్తంగా అసాధారణమైన కొవ్వులు పెరగడంవల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువవుతుంది. స్పెయిన్ కు చెందిన 3275 మంది పైన ఈ పరిశోధన చేశారు. వీరి సగటు వయసు 40 ఏళ్లు. వీళ్లలో మహిళలు 78 శాతం. మధ్యాహ్నం నిద్రతోపాటు, వారి ఇతర జీవనశైలి అలవాట్లనీ అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 30 నిమిషాలకు మించి నిద్రపోయే వారిలో బీఎమ్ ఐ పెరుగుదల, జీవక్రియ సమస్యలు (రక్తపోటు, పక్షవాతం, టైప్-2 మధుమేహం) వచ్చే ముప్పు ఆ సమయంలో అస్సలు నిద్రపోనివారికంటే ఎక్కువని తేల్చారు. మధ్యాహ్నం నిద్ర ఎక్కువైతే.... రాత్రిళ్లు ఆలస్యంగా తినడం, లేటుగా నిద్రపోవడం... ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోందట. 30 నిమిషాల్లోపు కునుకు తీసేవాళ్లలో ఈ సమస్యలేవీ లేవట!

Comments

-Advertisement-