-Advertisement-

యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు

• ర్యాగింగ్ నిరోధక చర్యలు పటిష్టం..

విశ్వవిద్యాలయం రేపటి భవిష్యత్తును నిర్ణయించే ఒక సోపానం..

• మీ నిర్ణయాన్ని బట్టి రేపటి మీ స్థానం ఉంటుంది.. మీ ఆలోచన విధానమే రేపటి సమాజానికి దిక్సూచి..

• సమాజంలో రేపటి స్థానం, మీ భవిష్యత్తు నిర్ణయించేది కూడా ఇక్కడే..

• సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వక భావంతో పరిచయం చేసుకుని ఆహ్వానించాలి. వారి మనోభావాలను దెబ్బతీసే వికృత చేష్టలకు పాల్పడి మీ అమూల్యమైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దు..

• రేపటి రోజు ఎలా ఉండాలో ఇక్కడే పునాది వేసుకోండి.. దేశ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిలో మమేకం కండి..

• విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కోసం విశ్వవిద్యాలయం వారు ర్యాగింగ్‌ను నిరోధించడంలో తన నిబద్ధతను పాటించాలి..

• UGC నిబంధనలను ఖచ్చితంగా పాటించి, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లు మరియు మానిటరింగ్ సెల్ లు విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఎర్పాటు చేయాలి..

• నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ (1800-180-5522) పోలీసు హెల్ప్‌లైన్...112.

• ర్యాగింగ్‌ను సహించబోము. విద్యార్థుల భద్రత.. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాము..

• యాంటీ ర్యాగింగ్ టీం లు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి..

• ర్యాగింగ్ రహిత వాతావరణాన్ని సృష్టిద్దాం..

-జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

తిరుపతి అక్టోబర్ 25 (పీపుల్స్ మోటివేషన్):- యాంటి ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఈరోజు ఎస్వీ ఆడిటోరియం నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ యల్. సుబ్బరాయుడు ఐపిఎస్., పాల్గొని, విద్యార్థులకు కొన్ని అమూల్యమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం అందరికీ రాదు. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోపరుచుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించుకునే సోపానంగా మార్చుకోవాలని అన్నారు. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరికి చక్కటి భవిష్యత్తును కళాశాల/విశ్వవిద్యాలయం లో నాంది పలుకుతుందని, క్రమశిక్షణతో చదివి రేపటి రోజు ఎలా ఉండాలని పునాది ఇక్కడే వేసుకోవచ్చు అన్నారు. ర్యాగింగ్ అనేది మహా భూతమని, ఇది విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలను కూడా నాశనం చేస్తుందని, అంతేకాకుండా క్రిమినల్ చర్యలవైపు వెళ్లే విధంగా చేసి భవిష్యత్తును అంధకారంలోకి తీసుకువెళ్తుందని అన్నారు. ర్యాగింగ్ నిరోధించడంలో విద్యార్థులు విద్యాసంస్థ వారు కూడా బాధ్యత వహించాలి. ర్యాగింగ్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చట్టం లో ఉన్న శిక్షల గురించి తెలియజేస్తూ నోటీసు బోర్డులను విద్యాసంస్థ వారు ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్లు జూనియర్లను సాటి వ్యక్తిగా సోదరభావంతో ముఖ పరిచయం చేసుకుంటూ వారి ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా సహృద్భావంతో ప్రవర్తించాలని అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ర్యాగింగ్ నిర్మూలన కొరకు పోస్టర్లు మరియు బ్యానర్లు ఏర్పాటుచేసి కళాశాల మరియు విశ్వవిద్యాలయాలలో కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని ఎక్కడైనా ర్యాగింగ్ వంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే డైల్ 112/ యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-5522/ UGC పోర్టల్ ద్వారా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ.. అపార భవిష్యత్తు ఉన్న విద్యార్థులైన మీరు ర్యాగింగ్ ను విడనాడండి.. ఆశయ లక్షణ సాధన కోసం దృష్టి సారించండి అని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. ర్యాగింగ్ సంబంధిత ఏ సమస్య ఉన్న వెంటనే యాజమాన్యానికి పోలీసులకు తెలియజేయాలని ర్యాగింగ్ రహిత ఎస్వీ యూనివర్సిటీ లక్ష్యంగా మనమందరం ముందుకు వెళ్లాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. చివరగా ఉపకులపతి "యాంటీ - ర్యాగింగ్ ప్లెడ్జ్" నూ విద్యార్థులు అందరి చేత ప్రమాణం చేయించారు. 

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం భూపతి నాయుడు, సి డి సి డిన్ ఆచార్య ఎన్ చండ్రాయుడు, తిరుపతి డి.ఎస్.పి వెంకటనారాయణ, ఆచార్య మురళీధర్, కల్చరల్ కోఆర్డినేటర్ డా. పత్తిపాటి వివేక్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. హరికృష్ణ యాదవ్, వర్సిటీ సిఐ ఎస్సై లు రామయ్య, వెంకట కిశోర్, అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్లు, పరిశోధకులు, విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మరియు వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

-Advertisement-