-Advertisement-

తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్

- విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం

- కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించిందన్న నాదెండ్ల

- ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతోందని వెల్లడి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు వంట నూనె దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. విజయవాడ సివిల్ సప్లయ్స్ భవనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని తెలిపారు. పెరిగిన ధరల నుంచి ప్రజలను కాపాడేందుకు తక్కువ ధరకే వంట నూనెను అందించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 

అందులో భాగంగా పామాయిల్ లీటరు రూ.110... సన్‌ప్లవర్ ఆయిల్ రూ.124కే ప్రజలకు అందుబాటులో ఉంచామని నాదెండ్ల వివరించారు. ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. దీంతో దిగుమతి దారులు నుంచి ఇబ్బందులు లేకుండా సప్లయ్ పెంచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లయ్ పెంచాలని, అదే సమయంలో సకాలంలో సప్లయ్ అందించాలని కోరామని వెల్లడించారు.

Comments

-Advertisement-