-Advertisement-

సాంకేతిక సమస్యకు పరిష్కారం..ఆన్లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు.. పత్తి కొనుగోళ్లు ప్రారంభం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

సాంకేతిక సమస్యకు పరిష్కారం..ఆన్లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు.. పత్తి కొనుగోళ్లు ప్రారంభం 

గత వారము రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో క్రయవిక్రయాలు జరుగు ఈ-నామ్ నందు సాంకేతిక సమస్య కారణంగా టెండరు జరుపుటకు ఇబ్బంది పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖామాత్యులు కింజరపు అచ్చెంనాయుడు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి టెండరు విధానములో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించడమైనది.

మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు మార్కెట్ యార్డు నందు కమీషన్ ఏజెంట్లు మరియు వ్యాపారస్థులతో సమీక్ష సమావేశము నిర్వహించి క్రయవిక్రయాలు అయిపోనటువంటి ఉల్లిగడ్డలను వాహనముల ద్వారా త్వరగా బయటకు తరలించుటకు చర్యలు తీసుకొనడమైనది. 

సోమవారం రోజు కర్నూలు మార్కెట్ యార్డుకు 43,000 బస్తాల ఉల్లిగడ్డలు క్రయవిక్రయానికి వచ్చినవి. ఈ-నామ్ నందు సాంకేతిక సమస్య పరిష్కారము అవడంతో ఈరోజు క్రయవిక్రయాలు ఆన్లైన్ పద్దతిలో జరపడమైనది. క్రయవిక్రయాలు అయినటువంటి ఉల్లిగడ్డలను త్వరగా బయటకు తరలించుటకు చర్యలు తీసుకొనడమైనది.

పత్తి కొనుగోళ్లు ప్రారంభం 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారముతో కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సి.సి.ఐ.) వారు రాష్ట్రములో 2024-25 సీజన్ కు సంబదించి పత్తి కొనుగోలు కొరకు రైతులు రైతు సేవా కేంద్రములలో నమోదును 27 అక్టోబర్ 2024 నుండి ప్రారంభించడం జరిగినది. 

కావున రైతులు, వారి యొక్క పంట వివరములను రైతు సేవా కేంద్రముల నందు నమోదు చేసుకోనవలసినదిగా అవగాహన కల్పించడమైనది మరియు సి.సి.ఐ. వారి నాణ్యత ప్రమాణములు ఉన్నటువంటి పత్తిని మాత్రమే కొనుగోలు చేయుదురు కావున రైతులు నాణ్యమైన విడి పత్తిని కొనుగోలు కేంద్రములకు తీసుకొని రావలసినదిగా కోరడమైనది.

ఈ విషయమై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మాత్యులు సమీక్షించి రైతులకు సరైనా అవగాహన కల్పించి మద్దతు ధరకు పత్తిని సి.సి.ఐ. వారికి విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమైనదని తెలియజేసినారు. 

ఖరీప్ 2024-25 సీజన్ కు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన పత్తి కనీస మద్దతు ధరలు:

పొడవు పింజ : రూ.7521/- క్వింటాలకు

పొట్టి పింజ : రూ.7121/- క్వింటాలకు

Comments

-Advertisement-