-Advertisement-

ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS
Peoples Motivation

ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని


భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ధోని సొంత రాష్ట్రం ఝార్ఖండ్ కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ భావించింది.

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS

ఈ మేరకు ఆ రాష్ట్ర‌ చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్‌ ప్ర‌క‌టించారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన క‌లిగించేందుకు మహేంద్ర సింగ్ ధోని తోడ్పాటు అందిస్తార‌ని ఆయ‌న‌ తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను ఎన్నికల సంఘం వాడుకునేందుకు కూడా ధోని, అంగీక‌రించినట్లు ఈసీ వెల్ల‌డించింది. ఇదిలాఉంటే.. వచ్చే ఏడాది జనవరి 5తో ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది. దాంతో ఈ నవంబ‌ర్‌లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది. ఇక 81 అసెంబ్లీ స్థానాలు క‌లిగిన‌ ఝార్ఖండ్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Comments

-Advertisement-