జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు..
వాల్మీకి మహర్షి రచించిన "రామాయణం మహాకావ్యం" సమస్త మానవాళికి ఆదర్శం.
వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS
నంద్యాల, అక్టోబర్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నేడు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు జన్మించిన పుణ్యభూమి భారతదేశం.ఈ తరం వారు వాల్మీకి మహర్షి లాంటి మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తి పొంది వారి మార్గంలో పయనించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతారు. అలాంటి ఓ మహనీయుడు వాల్మీకి మహర్షి అని నేడు ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నాము.
వాల్మీకి మహర్షి గొప్ప మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే రామాయణం లాంటి మహాకావ్యాన్ని రచించి, సమాజానికి అందించిన వాల్మీకి మహర్షి చూపిన దారిలో మనందరం నడవాలని, నేడు ఆయన జయంతి సందర్భంగా మనమందరం వాల్మీకి మహర్షిని స్మరించుకొంటూ అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అర్ముడు రిజర్వ్ DSP శ్రీనివాసులు, RI మంజునాథ్,నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.