ఈ చిట్కాలు పాటించి.. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందండిలా.!
ఈ చిట్కాలు పాటించి.. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందండిలా.!
- పంటి నొప్పికి చిగుళ్లు కూడా కారణం కావొచ్చు.
- అకర్కర పువ్వుతో అద్భుత ఫలితం.
- ఈ చిట్కాలు పాటించి పంటి నొప్పిని దూరం చేసుకోండి.
పంటి నొప్పికి దంతాలు లేదా చిగుళ్లు కారణమవుతాయి. మీకు పంటి నొప్పి ఉంటే.. ఈ రెండింటిలో ఆ సమస్యకు మూలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు మాత్రమే నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో నిర్ణయించుకోవచ్చు. ఒక వేళ పంటి నొప్పి రెండ్రోజులకంటే ఎక్కువగా ఉంటే.. వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే ఇక్కడ తెలిపిన రెమెడీస్ కూడా మీకు ఉపయోగపడతాయి.
మీ దంతాలలో పురుగులు, పసుపు రంగు దంతాలు, నొప్పి ఉంటే.. చిటికెడు పటిక, చిటికెడు రాళ్ల ఉప్పు, 2 లవంగాలు తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడపోసి పుక్కిలించాలి. దీనితో పంటి నొప్పి, పైయోరియా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. లవంగం నూనె లేదా లవంగాలు నమలడం ద్వారా కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. లవంగం ఒక రకమైన సహజ మౌత్ ఫ్రెషనర్‌గా పరిగణించబడుతుంది. ఇది నోటి నుంచి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
మరో చిట్కా ఏంటంటే.. అకర్కర పువ్వు(Anacyclus pyrethrum) కూడా పంటి నొప్పిని తొలగిస్తుంది. నొప్పి ఉన్న పంటిపై ఒక నిమిషం పాటు ఈ పువ్వును ఉంచండి. ఈ పువ్వును ఉంచిన ఒక నిమిషంలో మీరు ఉపశమనం పొందుతారు. అంతే కాదు పళ్లలో కూరుకుపోయే పురుగులను కూడా ఈ పువ్వు చంపుతుంది. ఔషధ గుణాలు కలిగిన ఈ పుష్పం గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.