ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం
గుడ్ టచ్ బాడ్ టచ్, మహిళా సంబంధిత నేరాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్, లోన్ యాప్ మోసాలు, రహదారి భద్రతా నియమాలు,ఆత్మహత్య ఆలోచనల నివారణ పై పాఠశాల విద్యార్థులకు అవగాహన.
-సబ్ ఇన్స్పెక్టర్ K.మమత
డోన్, అక్టోబర్ 19 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాల మేరకు డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల AP మోడల్ స్కూల్ నందు 6th నుండి ఇంటెర్ విధ్యార్తిని, విద్యార్థులతో సబ్ ఇన్స్పెక్టర్ మమత గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా పాఠశాల విద్యార్థులతో స్కూల్ ప్రాంగణంలో సమావేశమై డ్రగ్స్, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, బాలికల సంరక్షణ చట్టం (ఫోక్సో చట్టం), సైబర్ క్రైమ్, రహదారి భద్రత నియమాలు,ఆత్మహత్య ఆలోచనల నివారణ మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
➡️ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. బాలికలు మహిళలు ఏదైనా ఆపద సమయంలో డయల్ 100/112 కు ఫోన్ చేసి పోలీసులు వారి సహాయాన్ని తక్షణమే పొందాలని సూచించారు. ఈ సృష్టికి మూలం ఒక స్త్రీ కాబట్టి అటువంటి స్త్రీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు.
➡️మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఒక్కసారి అలవాటు పడితే అవి మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తాయి. మీకు ఎవరికైనా మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
➡️అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. మొబైల్ దొంగతనం, సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్ మోసాల గురించి వివరించి, అపరిచుతుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్తులు అంగీకరించవద్దు.మీ వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవద్దు.వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందస్తు జాగ్రత్తలను వివరించారు.ఎవరైన సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి గాని www.cybercrime.gov.in లో 24 గంటల లోపల ఫిర్యాదు చేయండి.
➡️లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే మరియు ఎవరైనా మైనర్ లు వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేసి వారి తల్లిదండ్రుల పై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, రహదారిపై మీ కళ్ళ ముందు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా రహదారి భద్రత నియమాలను పాటించి మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
➡️ క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి, చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డోన్ సబ్ ఇన్స్పెక్టర్ తోపాటు AP మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చంద్రకాంత్ యాదవ్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.