భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు
భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు
గ్రామ సభలో వచ్చిన భూసమస్యలను పరిష్కరిస్తాం
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు..
గురువారం గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామంలో రీ సర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ రీ సర్వే కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని, అందువల్లనే కుర్నూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రతి సోమవారం భూ సమస్యలకు సంబంధించి జిల్లా కేంద్రానికి రాకుండా రీ సర్వే జరిగిన గ్రామాల్లోనే గ్రామ సభల్లో సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసిల్దార్, సర్వేయర్ లాంటి అధికారులందరూ పాల్గొని ప్రజల నుండి భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.. సమస్యలకు సంబంధించి అవసరమైతే ఫీల్డ్ కి వచ్చి సర్వే నిర్వహించి, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. భూములు సాగుచేసుకుంటున్న వారి వివరాలను అన్నీ జాగ్రత్తగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
గ్రామ సభలో విస్తీర్ణంలో కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ రావడం, మరి కొంతమందికి జాయింట్ ఎల్పీఎం లు రావడం వంటి సమస్యలు వచ్చాయని, ఆ సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు..
గ్రామసభలో స్వీకరించిన దరఖాస్తులలో వీలైనన్ని దరఖాస్తులను ఈరోజే పరిష్కరించాలని, అవసరం అయితే సర్వేయర్లు అందరూ ఫీల్డ్ కి వెళ్లి వెరిఫై చేసి, సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు..
తొలుత కౌంటర్ లను పరిశీలిస్తూ కౌంటర్ లు అవసరం అనుకుంటే కౌంటర్ లను పెంచుకోవాలని, దరఖాస్తుల నమోదు వేగవంతంగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
అనంతరం గ్రామ సర్పంచ్ తో మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. సీసీ రోడ్లు మంజూరు చేయాలని సర్పంచ్ కోరగా, మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు..
కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సర్వే ఏడి మునికన్నన్ తదితరులు పాల్గొన్నారు..