మహిళలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు
మహిళలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు
ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ప్రతి కార్యాలయంలో ఏర్పడాలి
జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య
కర్నూలు, అక్టోబరు 22 (పీపుల్స్ మోటివేషన్):- మహిళలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.బి.నవ్య పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళలు పని చేసే చోట వారిపై జరిగే లైంగిక వేధింపులు, హింస, వివక్ష, వ్యతిరేకత నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి వెంకటలక్ష్మి, లైంగిక వేధింపులు కమిటీ ఛైర్మన్ డాక్టర్ మాధవి శ్యామల, న్యాయవాది నాగలక్ష్మి, జిల్లా స్థాయి మహిళా అధికారులు, దిశా వన్ స్టాప్ పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది, పొదుపు సంఘం మహిళలు తదతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ కేసు మార్గనిర్దేశాల ప్రకారం పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపుల నివారణకు కమిటీలు ఏర్పాటు కావడం జరిగిందని సదరు కమిటీలు పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులపై పోరాడేవని, 2013వ సంవత్సరం తరువాత వచ్చిన చట్టాలను ఇంకా బలోపేతం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రతి ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాల్లో పది మందికి మించి ఉంటే ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీనివల్ల తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన కూడా నిలువరించే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ సదరు కమిటీ దాటి వచ్చిన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిని ఎవ్వరినీ ఉపేక్షించే అవకాశం లేదని తద్వారా ఉద్యోగానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. సాటి ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించకూడన్నారు. ముఖ్యంగా పిలల్లి పెంచే సమయం నుంచి వారి ఆలోచన విధానాన్ని గమనిస్తే ఎటువంటి తప్పులు చేసిన ఖండించాలన్నారు. మనం ఇంట్లో ఎంతసేపు ఉంటామో అంతే సమయం కార్యాలయాల్లో ఉంటామని అందరు సిబ్బంది కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. అదే విధంగా తోటి సిబ్బందిపై తప్పుడు ఆరోపణలు చేయకూడదని తద్వారా నిజంగా జరిగిన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉండన్నారు. పాఠశాల, కళాశాలలో కూడా పిల్లలకు, విద్యార్థిని, విద్యార్థులకు పోష్ యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై కూడా వారికి అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ స్త్రీ లేనిదే మనకు మనుగడ లేదన్నారు. ఎప్పుడైతే మహిళా అర్థరాత్రి బయటికి వెళ్లి ఇంటికి స్వేచ్ఛగా తిరిగి వస్తుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్య వచ్చినట్లు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఆర్టికల్స్ 14, 15, 19, 21 ఆధారంగా ఫోక్సో యాక్ట్ ను తయారు చేయడం జరిగిందన్నారు. మహిళాపై ఎటువంటి వేధింపులు జరిగిన పాత కేసులను కూడా కమిటీ తీసుకొని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఫిర్యాదు తీసుకున్న ఏడు రోజుల్లో నోటీసు ఇచ్చి సెక్షన్ 10 ప్రకారం విచారణకు ముందు ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడడం జరుగుతుందన్నారు. విచారణ సమయంలో కమిటీ సభ్యులు పరిహారం వైపు మొగ్గు చూపకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సిపిసి ప్రకారం విచారణ అధికారికి సివిల్ న్యాయస్థానం తరహాలో సమ్మన్ చేసే అవకాశం ఉంటుందని వారి విచారణ అనంతరం విచారణ రిపోర్టును సంబంధిత అధికారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వేధింపులు ఎక్కువ శాతం ఉన్నట్లయితే కమిటీకి క్రిమినల్ కేసులు బుక్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇరు సభ్యులను కూడా 60రోజుల్లో విచారించి పది రోజుల్లో రిపోర్టు అందజేయాలని విచారణ ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తున్నారని న్యాయ విభాగంలో కూడా సుమారుగా 52 మంది మహిళా న్యాయమూర్తులు రావడం ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మహిళలు భయపడే అవకాశం లేదని న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో అందుకు సహాయ సహకారాలు అందిస్తామని ఏ శాఖలో సమస్య వచ్చిన సివిల్, క్రిమినల్ కేసులను టోల్ ఫ్రీ నెంబర్ 1500 కు ఫిర్యాదు చేసినట్లయితే అందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేయూత ఇవ్వడం జరుగుతుందని, మండల స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలు ఉన్నాయని వారికి అవసరమైన న్యాయ సేవలను సద్వినియోగం చేసుకొని ఏ సమస్య వచ్చిన ధైర్యంగా ఎద్దుర్కోవాలన్నారు.
అంతకుముందు డాక్టర్ మాధవి శ్యామల, ప్రేమ, నాగలక్ష్మి, పోష్ యాక్ట్ అమలు, చట్టాలపై కార్యక్రమానికి హాజరైన మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక, హింస వేధింపుల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో లైంగిక వేధింపులు కమిటీ సభ్యులు, మహిళా ఉద్యోగులు, ఐసిడిఎస్ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.