నియమ నిబంధనల ప్రకారం బాణాసంచా స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్ లు మంజూరు చేయాలి
నియమ నిబంధనల ప్రకారం బాణాసంచా స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్ లు మంజూరు చేయాలి
ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోండి
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
నియమ నిబంధనల ప్రకారం బాణాసంచా స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్ లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బాణాసంచా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పై ఏమైనా నేర చరిత్ర ఉందా? లేదా? అని వెరిఫై చేసి లైసెన్స్ ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు....దుకాణానికి దుకాణానికి మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలని, షాప్స్ ను ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ తో నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఒక క్లస్టర్‌లో యాభై దుకాణాలకు మించి ఉండకూడదని, షాపుల్లో నూనెను కాల్చే దీపాలు, గ్యాస్ ల్యాంప్‌లు ఉపయోగించకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేయవలసిన అంశాల గురించి కలెక్టర్ వివరిస్తూ లైసెన్స్ కలిగి ఉన్న అమ్మకందారుల నుండే బాణాసంచా కొనుగోలు చేయాలని, పిల్లలు పెద్దల సమక్షంలోనే బాణాసంచా కాల్చాలని,బాణాసంచా కాల్చడానికి కొవ్వొత్తి లేదా అగరబత్తిని వాడాలని, అకస్మాత్తుగా వచ్చే మంటలను ఆర్పడానికి ఎల్లప్పుడూ ఒక బకెట్ నీటిని అందుబాటులో ఉంచుకోవాలని, వినియోగించిన బాణసంచాను నీటిలో నానబెట్టి పారవేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. చేయకూడని వాటి గురించి వివరిస్తూ, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య శబ్దాలను వెలువరించే బాణాసంచా పేల్చవద్దని, బాణాసంచాను చేతిలో పట్టుకొని కాల్చవద్దని, బాణాసంచాను పాత్రలలో పెట్టి కాల్చవద్దని, పనిచేయని బాణసంచాను వినియోగించవద్దని కలెక్టర్ సూచించారు. గాలిలో ఎగిరే బాణాసంచాను వినియోగించునపుడు, అవి వెళ్ళే మార్గంలో (చెట్లు, ఆకులు, తీగలు మొదలైనవి) అడ్డం లేని ప్రాంతంలో మాత్రమే కాల్చాలని, రహదారి మార్గంలో కాకుండా ఆరు బయట బాణా సంచాను కాల్చలని, నకిలీ బాణాసంచాను ఉపయోగించవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ బాణసంచాతో ప్రయోగాలు చేయవద్దని, స్వంతంగా బాణసంచాను తయారు చేయవద్దని, వెలగని బాణసంచాను మళ్లీ వెలిగించవద్దని, పిల్లలను ఒంటరిగా బాణాసంచాను కాల్చడానికి అనుమతించవద్దని కలెక్టర్ సూచిస్తూ పై మార్గదర్శకాలను ప్రజలందరూ పాటించి దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో దీపావళి జరుపుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు.