ఆది కావ్యం రామాయణాన్ని మానవాళికి అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి
ఆది కావ్యం రామాయణాన్ని మానవాళికి అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
ఆది కావ్యం రామాయణాన్ని మానవాళికి అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కొనియాడారు..
గురువారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేటగాడైన రత్నాకరుని నుండి మహర్షి వాల్మీకి గా మారిన తీరును వివరించారు. వారి జీవిత చరిత్ర ఆధారంగా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని తెలుస్తుందన్నారు.. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని లోకానికి చాటి చెప్పారని, రామాయణ మహా కావ్యం ద్వారా ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అని మానవాళికి మార్గదర్శనం చేసిన ఆది కవి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ కొనియాడారు.. వారిని గురువుగా, ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇతరులకు సాయం చేసే తత్త్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. మన కుటుంబ పోషణ తో పాటు అవసరం ఉన్న వారిని ఆదుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు... రాష్ట్ర ప్రభుత్వం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోoదన్నారు. వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించాలని, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని తదితర విషయాలను ప్రస్థావించారని, జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ పరిధిలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు..
పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. మహర్షి వాల్మీకి రామాయణం ద్వారా నిర్దేశించిన ధర్మ మార్గంలో నడవాలని తెలియజేశారు. . వాల్మీకుల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పేర్కొన్నారు .
జిల్లా హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, నాయకులు కప్పట్రాళ్ల బొజ్జమ్మ ,కుబేర స్వామి, సత్రం రామకృష్ణ, నక్కమిట్టల శ్రీనివాసులు, గడ్డం రామకృష్ణ, వినోద్ కుమార్ లు తదితరులు మాట్లాడుతూ వాల్మీకులు చైతన్యం పొంది, బాగా చదువుకుని, ఆర్ధికాభివృద్ధి సాధించాలని, వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు..ఈ సందర్భంగా సంఘాల నాయకులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు .
అనంతరం అంతర్జాతీయ పారా ఒలింపిక్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన రామాంజనేయులు, నేషనల్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరేశ్ ను జిల్లా కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు తదితరులు సత్కరించారు.
అంతకుముందు గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి జిల్లా కలెక్టర్, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, బిసి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..
కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ ముంతాజ్, ఏపి సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, ఏపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, బిసి సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, సహాయ కార్మిక శాఖ అధికారి సాంబశివరావు, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తలారి కృష్ణమ్మనాయుడు, బేతం కృష్ణుడు, కుబేర స్వామి, బాల సంజన్న, సత్రం రామకృష్ణడు, గిడ్డియ్య, జె.శ్రీనివాసుల నాయుడు, ప్రొ.హనుమంతప్ప, జ్ఞానేశ్వరమ్మ, నక్కలమిట్ట శ్రీనివాసులు, గడ్డం రామకృష్ణ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, సాంబశివరావు, వినోద్ కుమార్, రామచంద్రనాయుడు, మండ్ల శేఖర్, రవిశంకర్ నాయుడు, చౌడప్ప నాయుడు, శ్రీనివాస నాయుడు, వీరాంజనేయులు, బత్తుల లక్ష్మీకాంతయ్య, దేవపూజ ధనుంజయచారి, మల్లికార్జున నాయుడు బిసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అక్షరాస్యత తోనే మానవ వనరుల అభివృద్ధి
'ఉల్లాస్' కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు
స్వచ్ఛంద ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది ద్వారా బోధన
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
అక్షరాస్యత తోనే మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని, "ఉల్లాస్" కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉల్లాస్ కార్యక్రమం అమలు పై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు..ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రతి గ్రామం లో 50 ఏళ్ల లోపు ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడం నేర్పించాలన్నారు..స్వయం సహాయక సంఘాల్లో ఉన్న వారిని చింత ఉపాధ్యాయులు గా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు..వీరితో పాటు సచివాలయ ఉద్యోగులను కూడా ఇందులో భాగస్వాములు చేయాలన్నారు..ప్రతి సచివాలయ ఉద్యోగి సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఐదు నుండి పదిమంది నిరక్షరాస్యులను ఎంపిక చేసుకుని చదువు చెప్పేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జడ్పీ సీఈఓ ను ఆదేశించారు..వారికి వీలున్నప్పుడు తరగతులు బోధించేలా చూడాలని కలెక్టర్ సూచించారు.. తరగతులకు సంబంధించిన మెటీరియల్, వీడియోలను వాట్సప్ ద్వారా సచివాలయం సిబ్బందికి పంపించేలా చర్యలు తీసుకోవాలని వయోజన విద్యా శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు..
పొదుపు సంఘాల మహిళలు, సచివాలయం సిబ్బంది సర్వే చేసి గ్రామంలో నిరక్షరాస్యుల జాబితాను తయారు చేసుకోవాలన్నారు. పొదుపు సంఘాల్లో వాలంటీర్ టీచర్లను గుర్తించాలని కలెక్టర్ డిఆర్డిఎ ఎపిడి ని ఆదేశించారు. ముందుకు వచ్చిన వాలంటరీ టీచర్లక, సచివాలయ సిబ్బందికి పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. తరగతుల నిర్వహణకు అంగన్వాడీ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు.. అక్షరాస్యతా తరగతులు సక్రమంగా నిర్వహించేలా పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలన్నారు.. ఎంఈఓ లు,హెడ్మాస్టర్లు, టీచర్లు సమర్థవంతంగా తరగతులు నిర్వహించేందుకు తగిన శిక్షణ, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. చదువు నేర్చుకున్న వారికి ఆరు నెలలకు ఒకసారి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ అందజేయబడుతుందని కలెక్టర్ తెలిపారు..6 నెలలకు ఈ అంశం పై అన్ని మండలాల ఎంపిడిఓ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, వయోజన విద్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డిఈఓ శామ్యూల్, డిపిఓ భాస్కర్, సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మ,ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఎ ఎపిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..