పండుగ పూట విషాదం.. ఉల్లిపాయ బాణాల బస్తా పేలి వ్యక్తి మృతి.. ఆరుగురికి గాయాలు
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
పండుగ పూట విషాదం.. ఉల్లిపాయ బాణాల బస్తా పేలి వ్యక్తి మృతి.. ఆరుగురికి గాయాలు
దీపావళి పండుగ పూట ప్రమాదవశాత్తు ఉల్లిపాయ బాణాల బస్తా పేలింది. ఇద్దరూ వ్యక్తులు ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఉల్లిపాయ బాణాల బస్తా బైక్ పై రవాణా చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి సుధాకర్ అనే వ్యక్తి శరీరం చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న ఆరుగురి వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు..గాయపడిన వారిలో తాబేలు సాయి, సువార శశి, కే. శ్రీనివాసరావు, ఎస్కే ఖాదర్, సురేష్, సతీష్ లు ఉన్నారు.హోండా యాక్టివా వాహనం పై ఉల్లిపాయ బాణాల బస్తా తీసుకు వెళుతుండగా బండిపై నుంచి గోతిలో పడటంతో ఒక్కసారిగా పేలుడు జరిగినట్టు తెలుస్తోంది..దీంతో వాహనం వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి శరీరభాగాలు పేలుడు ధాటికి తెగిపడిపోయాయి. సమాచారం అందుకున్న ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు.
పేలుడు ఘటనతో ఒక్కసారిగా తూర్పు వీధి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments