ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న (ఆర్ ఎమ్ పి )దేవేంద్ర డాక్టర్ :వాణి శ్రీ
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న (ఆర్ ఎమ్ పి )దేవేంద్ర డాక్టర్ :వాణి శ్రీ
అర్హత లేని ప్రాథమిక వైద్యులే... ఇక్కడ అనుభవం గల డాక్టర్లు..
మాటలే పట్టుబడి..డబ్బు మూటలకే ప్రాధాన్యం..
పారిశుధ్య లోపం.. పడిపోతున్న గోడ పెచ్చులు..
మందు మోతాదు తెలీదు.. మనుషుల మీద ప్రయోగం..
ప్రథమ చికిత్స వైద్యం అంటూ.. ప్రాణాలతో చెలగాటం..
కాలం చెల్లిన మందులు.. కాటికి కాళ్ళు చాపుతున్న మనుషుల ప్రాణాలు..
గ్రామీణ వైద్యులా.. యమ కింకరులా..
లైసెన్స్ ఒకరిది -ప్రాక్టీస్ మరొకరిది..
ఇటువైపు చూడని డ్రగ్స్ ఇన్స్పెక్టర్..
ప్యాపిలి పట్టణంలో శుక్రవారం రోజు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ వాణిశ్రీ పట్టణంలోని ఆర్ఎంపి వైద్యుడు దేవేంద్ర నిర్వహిస్తున్న ప్రధమ చికిత్స కేంద్రం నందు తనిఖీ చేయడం ద్వారా అక్కడ ఊహించని పరిణామాలు ఎదురైనాయి అంటూ పత్రికా విలేకరుల సమక్షంలో తనిఖీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
గ్రామీణ వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సంబంధిత శాఖాధికారులు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యులు మాత్రమే వైద్యం చేయవలసి ఉండగా అరకొర తెలిసిన వైద్యంతో అమాయక ప్రజల ఆరోగ్యాలతో ఆదాయమే పరమావధిగా సూదులు, సెలైన్లు పెడుతూ లెక్కలు కుప్పలు పోసుకుంటున్న బెండు అప్పారావులు ఎక్కువయ్యారు. నిరక్ష రాసులను తమ టార్గెట్ గా చేసుకుని మాయ మాటలు చెపుతూ మోతాదుకు మించిన నిషేధిత మందులు ఇస్తూ వైద్యం చేస్తున్నారు. నిషేధిత మందులు వాడ కూడదని ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టినా నిరూపయోగమమే అవుతున్నాయి. ఏ స్థాయి జబ్బుకు ఎంత మోతాదు ఇవ్వాలో తెలియని ఆర్ ఎమ్ పి వైద్యులు ఇష్టం వచ్చినట్లు డోసులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.ప్రభుత్వ వైద్య సిబ్బంది తక్కువేమీ కాదు. గర్భవతి అయ్యింది మొదలు కాన్పు సక్రమంగా అయ్యే వరకు భాద్యతగా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించ వలసిన సహాయక నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రైవేట్ వైద్యశాలలకు తరలిస్తూ కమీషన్లకు కకృతి పడుతున్నారు. ప్రభుత్వ జీతంతో పనిచేస్తూ ప్రైవేట్ గా అందే ఆదాయం కోసం గర్భవతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సకాలంలో వైద్యం అందదంటూ తల్లి బిడ్డ క్షేమం కోసం మెరుగైన వైద్యం ప్రైవేట్ వైద్యశాలలో దగ్గరుండి చేపిస్తానంటూ మాయ మాటలు చెపుతూ తరలిస్తున్నారు.
గర్భం దాల్చింది మొదలు కాన్పు జరిగే వరకు రికార్డులకే పరిమితమవుతున్న గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుకు ఎందుకు రాలేదని ప్రశ్నించే నాథుడే కరువవ్వటం కూడా వీరి అవకాశానికి ఒక కారణమే..
వైద్యం వికటిస్తే పెద్ద మనుషుల నడుమ పంచాయతీలు పెట్టి పోయిన ప్రాణం తిరిగి త్యాలేము కదా.. ఏదో అయిపోయింది అంటూ అంతో ఇంతో సొమ్ములు ముట్టచెపుతూ చేతులు దులుపుకుంటున్నారు. ఆపదలో ప్రథమ చికిత్స చేసి అర్హత కలిగిన వైద్యులకు పంపాల్సిన బెండు అప్పారావులు తామే అర్హత కలిగిన వైద్యులుగా వారి వద్దకు వచ్చిన పేషంట్స్ కు సూదులు, బాటిళ్లు అంటూ బెండు తీసి ఆర్దికంగా గుళ్ళ చేస్తూ.. శృతి మించిన అనారోగ్యంతో ఉన్న వారిని కమీషన్ల కకృతితో రెఫర్లు చేసి చేతులు దులుపుకోవటం కాదు కమీషన్లతో చేతులు తడుపుకుంటున్నారు. (మరో కథనంతో మీ ముందుకు పీపుల్ మోటివేషన్ దినపత్రికలో )వీక్షించగలరు.