-Advertisement-

Bathukamma: బతుకమ్మ పండుగ డేట్స్ విడుదల... ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి!!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Bathukamma: బతుకమ్మ పండుగ డేట్స్ విడుదల... ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి!!


General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

బతుకమ్మ పండుగ విశిష్టత

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వుల నడుమ పుప్పొడిని, పసుపు ముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి.

Bathukamma- Festival of Telangana: తెలంగాణ ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ తెలంగాణ వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే.

చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడిపాడతారు. ఈ ఏడాది 2024 లో భాద్రపద అమావాస్య అక్టోబరు 02న వచ్చింది. ఈ రోజు ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి... అక్టోబరు 10 తో ముగుస్తాయి.

 భాద్రపద అమావాస్య ( అక్టోబరు 02) నుంచి దుర్గాష్టమి ( అక్టోబరు 10) వరకూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు..


1వ రోజు -అక్టోబర్ 02 బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది.


2వ రోజు -అక్టోబర్ 03 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి - అటుకుల బతుకమ్మ

రెండో రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపుకుంటారు.


3వ రోజు -అక్టోబర్ 04 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విదియ -ముద్దపప్పు బతుకమ్మ

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ


4వ రోజు -అక్టోబర్ 05 శనివారం ఆశ్వయుజ శుక్ల తదియ - నానే బియ్యం బతుకమ్మ

నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ.


5వ రోజు -అక్టోబర్ 06 ఆదివారం ఆశ్వయుజ శుక్ల చవితి - అట్ల బతుకమ్మ

ఐదో రోజు అట్ల బతుకమ్మ


6వ రోజు -అక్టోబర్ 07 సోమవారం ఆశ్వయుజ శుక్ల పంచమి - అలిగిన బతుకమ్మ

ఆరో రోజు అలిగిన బతుకమ్మ - ఈ రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు.


7వ రోజు -అక్టోబరు 08 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్టి - వేపకాయల బతుకమ్మ

ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.


8వ రోజు -అక్టోబరు 09 బుధవారం ఆశ్వయుజ శుక్ల సప్తమి - వెన్నముద్దల బతుకమ్మ

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ


9వ రోజు -అక్టోబరు 10 గురువారం ఆశ్వయుజ శుక్ల అష్టమి ( దుర్గాష్టమి) -సద్దుల బతుకమ్మ


బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటుతాయి. భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత..తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు.

బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు కానీ వేల ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పేందుకు చాలా కథలున్నాయి. దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్ఛపోయిందట. ఆమెను మేల్కొలిపేందుకు స్త్రీలంతా గుమిగూడి ప్రార్థించారట. బతుకమ్మా అంటూ పాటలు పాడారట..సరిగ్గా పదో రోజు ఆమె నిద్రలేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నాని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు. ఈ వేడుకల్లో పాల్గొనే తెలంగాణ ఆడబిడ్డలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు...

"రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలను ప్రజా ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటుకునేలా అక్టోబర్ 2 నుంచి 10 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ముగింపు సద్దుల బతుకమ్మ నాడు ట్యాంక్ బండ్ వేదికగా పెద్దఎత్తున సంబరాలు జరుగుతాయి." అంటూ తెలంగాణ సీఎం సీపీఆర్వో అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.

Comments

-Advertisement-