Ayushman Bharat: పేదలకు ఉచితంగా ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్- పూర్తి వివరాలు మీకోసం..
Ayushman Bharat: పేదలకు ఉచితంగా ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్- పూర్తి వివరాలు మీకోసం..
ప్రతి ఒక్కరికీ సరైన చికిత్స అందేలా భారత ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం తో సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM JAY) అనేది సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య భద్రతను అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబం ఆసుపత్రిలో సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు మీకోసం.
పథకానికి ఎవరు అర్హులు?
ఈ పథకం సామాజిక-ఆర్థిక కుల గణన (SECC) 2011కి వర్తిస్తుంది.ఈ పథకానికి అప్లై చేసేందుకు అధికారిక వెబ్సైట్కు వెళ్లాలి.హోమ్ పేజీలో https://pmjay.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత ఎలిజిబిలిటీ బటన్‌పై క్లిక్ చేయాలి.ఇప్పుడు మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ లేదా SECC పేరును ఎంటర్ చేయాలి.వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది.ఈ స్కీమ్కు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్యామిలీ సభ్యుల పేర్లు అందులో కన్పిస్తాయి.
అవసరమైన పత్రాలు:
ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటే అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదా చూసుకోవటం ముఖ్యం.
ఆధార్ కార్డ్:
ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ ఉండాలి.
రేషన్ కార్డ్: మీ ఫ్యామిలీ డిటెయిల్స్ సబ్మిట్ చేసేందుకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
ఇతర ఐడీ కార్డులు:
ఒకవేళ మీ వద్ద ఆధార్ కార్డు అందుబాటులో లేకుంటే ఓటర్ ID, PAN కార్డ్ లేదా పాస్పోర్ట్ ఫొటో వంటి ప్రభుత్వ ID ప్రూఫ్స్ ను ఉపయోగించొచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన లబ్ధిదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించాలి.ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు సహాయం చేస్తారు.PM-JAY పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అధికారిక CSC లొకేటర్‌ని సందర్శించడం ద్వారా మీకు సమీపంలో ఉన్న CSC సెంటర్ను గుర్తించొచ్చు.CSCలో ఆపరేటర్ మీ ఎలిజిబిలిటీని వెరిఫై చేస్తారు.ఆపై అప్లికేషన్ను ఫిల్ చేయటంలో మీకు సహాయం చేస్తారు.
Check Your Application:
AB PM-JAY అప్లికేషన్‌ను పూరించిన తర్వాత వ్యక్తిగత వివరాలతో సహా అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేశారో లేదో మరోసారి చెక్ చేసుకోండి.మీ పేరు ఆధార్ లేదా రేషన్ కార్డులో ఉన్నట్లుగానే ఉండాలి. జీవిత భాగస్వామి, పిల్లలు, కుటుంబ వివరాలు, మీ నివాస చిరునామా కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. వీటన్నింటినీ మీరు క్లియర్ గా చెక్ చేసుకున్నాక అప్లికేషన్ ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు.
ఆయుష్మాన్ భారత్ ఇ-కార్డ్:
మీ అప్లికేషన్ను సక్సెస్ ఫుల్గా సబ్మిట్ చేశాక మీ వివరాలన్నీ వెరిఫై చేస్తారు. అన్నీ వివరాలు సరిగా ఉంటే ఆ తర్వాత CSC ఆపరేటర్ మీకు ఆయుష్మాన్ భారత్ ఇ-కార్డ్ ఇస్తారు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ కార్డ్ మీ హెల్త్ కార్డ్‌గా పనిచేస్తుంది.ఈ కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు.ఈ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందేందుకు ఈ కార్డ్ ఆసుపత్రిలో అవసరం అవుతుంది. కాబట్టి ఈ కార్డ్‌ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Find Hospital:
మీరు ఆయుష్మాన్ భారత్ ఇ-కార్డ్‌ని పొందిన తర్వాత ఏదైనా ప్యానలైజ్డ్ హాస్పిటల్‌లో ఉచిత చికిత్స పొందొచ్చు.పథకం కింద ప్యానెల్‌లో చేర్చిన హాస్పిటల్స్ లిస్ట్ PM-JAY వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.మీ సమీప ఆసుపత్రిని గుర్తించేందుకు అధికారిక వెబ్‌సైట్ హాస్పిటల్ ఫైండర్ https://hospitals.pmjay.gov.in/ ను సందర్శించండి.అందులో మీ లొకేషన్ అంటే మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి.ఇప్పుడు మీకు సమీపంలో ఉన్న ఆస్పత్రుల జాబితా కన్పిస్తుంది. ఇక్కడ AB PM-JAY కార్డ్‌ని ఉపయోగించి ఉచితంగా చికిత్స పొందొచ్చు.