AP Tenth: టెన్త్ పరీక్ష విధానంలో మార్పులు!
Ap tenth result
Ap tenth exam
Ap tenth syllabus
AP 10th Class Results 2024
bse.ap.gov.in 10th
Ap SSC marks memo download
Ap tenth exams updates news
By
Peoples Motivation
AP Tenth: టెన్త్ పరీక్ష విధానంలో మార్పులు!
వచ్చే ఏడాది నుంచి ఏపీలో టెన్త్ పరీక్ష విధానంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులను NCERT సిలబస్ ను విద్యార్థులకు బోధిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టులను SCERT సిలబస్ ను బోధిస్తున్నారు. విద్యార్థులు SCERT సిలబస్లో అన్ని పరీక్షలు రాస్తున్నారు. కస్తుర్బా గాంధీ, మోడల్ స్కూళ్లు, కొన్ని ఎంపిక చేసిన జిల్లా పరిషత్ స్కూళ్లలో సీబీఎస్సీ సిలబస్లోలో పాఠాలు చెబుతున్నారు. సీబీఎస్సీ విధానంలో ఇంటర్నల్, రాత పరీక్ష విధానం అమల్లో ఉంది. రాష్ట్రంలో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో రాత పరీక్షతో పాటు ఇంటర్నల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 20 మార్కులు ఇంటర్నల్, 80మార్కులు రాత పరీక్షకు కేటాయించనున్నారు. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఇంటర్నల్ మార్కులు వేయకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నారు. గతంలో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించగా.. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంతో 2019లో ఇంటర్నల్ విధానాన్ని రద్దు చేశారు. రాత పరీక్షలో మొదటి సెక్షన్లో ఒక మార్కు క్వశ్చన్లను 12 ఇస్తుండగా.. వీటిని అర మార్కుగా, సెక్షన్ 2లో 2 మార్కుల క్వశ్చన్స్ 8 ఇస్తుండగా.. వీటిని ఒక మార్కుగా చేయనున్నారు. సెక్షన్ 3లో 4 మార్కుల క్వశ్చన్స్, సెక్షన్ 4లో 8 మార్కుల క్వశ్చన్స్ యథావిధిగా ఉంచనున్నారు.
Comments