-Advertisement-

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ..2029 కల్లా పేదలందరికీ శాశ్వత గృహాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ..2029 కల్లా పేదలందరికీ శాశ్వత గృహాలు


రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడంతో రాష్ట్రంలో ఆస్తుల విలువలు గణనీయంగా పెరిగాయి

రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆరు నూతన పాలసీలు

అమరావతి, పోలవరం, రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ది పనులతో  సామాజిక ఆర్థికాభివృద్దితో పాటు భవిష్యత్తు ఉజ్వలం

రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద నాకు ఇల్లు లేదనే మాటకు అవకాశం లేకుండా 2029 కల్లా పేదలందరికీ శాశ్వత  గృహాలు

- రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

 నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ తో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. 

దాదాపు  రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆరు నూతన పాలసీల నేపథ్యంలో  దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంతా ఆంధ్రప్రదేశ్ వైపుకు చూస్తున్నారన్నారు. 

పరిశ్రమలు, ఎం.ఎస్.ఎం.ఇ. పుడ్, గ్రీన్ ఎనర్జీ, ప్రైవేటు పార్కులు, ఎలక్ట్రానిక్స్ కు సంబందించిన ఆరు నూతన పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం  రూపొందించడం జరిగిందన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిపోయిన వ్యవస్థలు అన్నింటినీ ట్రాక్ లో పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్దిపదంలో పరుగులు పెట్టించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అహరహం కృషి చేస్తున్నారన్నారు. 

ఎంతో దూర దృష్టి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎపీ అంటే ఎ-అమరావతి, పి-పోలవరం అనే బ్రాండ్తో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్నారన్నారు. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే  పోలవరానికి కేంద్ర నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయించడంలో ఘన విజయాన్ని సాదించారన్నారు. వచ్చే రెండుమూడేళ్లలో ఈ ప్రాజక్టు పూర్తి అవుతుందనే గట్టి విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి కల్పించారన్నారు. రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ఇప్పటి వరకూ ఒక మిథ్యగా ఉండేదని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అమరావతి అభివృద్ది పనులు  ఎంతో నూతనోత్సాహంతో వేగవంతంగా ముందుకు వెళుతున్నాయన్నారు. రానున్న రెండు మూడేళ్లలో రాష్ట్ర రాజధాని అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప కేపిటల్ సిటీగా మారుతుందనే భరోసాని, విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి కల్పించారన్నారు.   

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో రైల్వే,  జాతియ రహదారుల అభివృద్దికై కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవ్వడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో రైల్వే ప్రాజక్టుల అభివృద్దికై రూ.9,138 కోట్లు,  జాతీయ రహదారుల అభివృద్దికై రూ.6,280 కోట్లను కేంద్ర రాష్ట్రానికి మంజూరు చేయడం  జరిగిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అమరావతి, పోలవరం, రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ది పనుల ఫలితంగా సామాజిక ఆర్థికాభివృద్ది ఎంతో గొప్పగా జరిగి భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 


2029 కల్లా నిరుపేదలు అందరికీ శాశ్వత గృహాలు...

                                                                                    రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కూడా నాకు ఇల్లు లేదనే మాట అనే అవకాశం లేకుండా 2029 కల్లా  రాష్ట్రంలోని నిరుపేదలు అందరికీ శాశ్వత గృహాలు నిర్మించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా గృహ నిర్మాణ కార్యక్రమాలను   రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-2 మార్గదర్శకాలకు అనుగుణంగా 2025 నుండి 2029 మధ్య కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున శాశ్వత గృహాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  పిఎంఏవై-2 క్రింద లబ్దిదారులకు మరింత మేలు కలిగే విధంగా యూనిట్ కాస్టును పెంచాలని, లబ్దిదారులకు ఎటు వంటి గ్యారెంటీ లేకుండా  మంజూరు చేసిన గృహాన్నే సెక్యూరిటీగా పెట్టుకుని ఋణాలు బ్యాంకులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కూడా   రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు.

ఒక వైపు అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కూడా పెద్ద పీఠవేస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. సామాజిక భద్రతా పింఛన్లను  రూ.3 వేల నుండి 4 వేలకు పెంచడం, ఈ నెల 31 నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం, గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన  ధాన్యం బకాయిలను చెల్లించడం తదితర సంక్షేమ కార్యక్రమాలను  తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

అయితే వ్యక్తి గత కక్షలతో చెదురు మదురుగా  రాష్ట్రంలో జరిగే  దురదృష్ట సంఘటనలను  ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రభుత్వం పై బురద చల్లే విధంగా గత ముఖ్యమంత్రి ప్రయత్నించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎటు వంటి  శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల వ్యవసాయ, పట్టణ భూములు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో వాటి విలువ ఎంతో దిగజారి ఎన్నో లక్షల కోట్లను ప్రజలు నష్టపోయారన్నారు. అయితే  ప్రస్తుత ముఖ్యమంత్రి  దూర దృష్టి కారణంగా మరియు ఆయనపై ఉన్న విశ్వాసం, భరోసా కారణంగా   రాష్ట్రంలో ఆస్తుల విలువలు కూడా భారీ స్థాయిలో పెరిగాయన్నారు.

Comments

-Advertisement-