-Advertisement-

Tirumala laddu: తిరుమలలో లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు.? దిట్టం అంటే ఏమిటి.? లడ్డూ ఎలా తయారు చేస్తారో తెలుసా.. పూర్తి వివరాలు

Tirupati Laddu online Tirupati Laddu owner Tirupati Laddu history Big size Tirupati Laddu Tirupati Laddu ingredients Tirupati Laddu weight and price
Peoples Motivation

Tirumala laddu: తిరుమలలో లడ్డూ తయారు చేసే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు.? దిట్టం అంటే ఏమిటి.? లడ్డూ ఎలా తయారు చేస్తారో తెలుసా.. పూర్తి వివరాలు...

భక్తులు అమృతంగా భావించే తిరుమల లడ్డూకు ఎన్ని లడ్డూలున్నా శ్రీవారి లడ్డూకున్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. వేదాలే శిలలై వెలసిన కొండ! భక్త కోటి ముక్త కంఠంతో ఎలుగెత్తి పిలిచే తిరుమల కొండ! "వేం కటేశ్వరుడు" వెలసిన కొండ. ఆ తిరుమలేశుని దర్శనానంతరం అందరూ భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే "తిరుమల లడ్డూ".  ఎందుకంటే ఈ లడ్డూ రుచి, సుచి, సువాసన ఈ భూమండలంలో ఏ లడ్డూకు ఉండదు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? ఏ ఏ వస్తువులు వినియోగిస్తారో మీకు తెలియదా? అయితే ఒకసారి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి...

Tirupati Laddu online Tirupati Laddu owner Tirupati Laddu history Big size Tirupati Laddu Tirupati Laddu ingredients Tirupati Laddu weight and price Tirupati Laddu contractor name Tirupati Laddu price

తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైందంటే..

ఈ‌ భూ ప్రపంచంలో ఇతరులు ఎవరూ తయారు చేయడానికి వీలులేకుండా భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు(Geographical indication) ఉన్న ఏకైక లడ్డూ తిరుమల లడ్డూ. అంటే తిరుమలేశుని లడ్డూతయారీ విధానాన్ని ఎవరూ కాపీ కొట్టవద్దని దీనర్థం. తిరుమల ఆలయం ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం అప్పట్లో వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’(నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆరోజుల్లో స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులకు భోజన సదుపాయాలు లేవు. ఈ ప్రసాదాలు స్వీకరించే భక్తులు తమ ఆకలి తీర్చుకునేవారు. వాస్తవానికి బ్రిటీషు పాలనలో తిరుమల ఆలయ నిర్వహణను మహంతులు పర్యవేక్షించేవారు. వారు 19వ శతాబ్ది మధ్యభాగంలో ప్రసాదాల్లో తీపిబూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి ఆ తీపి బూందీ కాస్త లడ్డూగా రూపాంతరం చెందింది. క్రమేపీ "వడ" స్థానంలో "లడ్డూ" పూర్తి స్థాయి ప్రసాదమైంది.

"లడ్డూ" పేరు వెనుక కథ:-

సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టీకము అని, తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అని పిలుస్తారు. 12వ శతాబ్ది "మానసోల్లాస గ్రంథం"లో వీటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. హిబ్రూలో LUD అనే పదంను లడ్డూకు సమానార్ధకంగా చెబుతారు. ముద్దగా చేయడాన్నే "లడ్డు"గా పేర్కొన్నారు.

లడ్డూ తయారీశాల-పోటు:-

తిరుమల తిరుపతి దేవస్థానంలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల) కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. అలా తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లడ్డూ, వడలు మొదలైన ఫలహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారు చేస్తారు. ఆ ఫలహారాలను కూడా వకుళామాతకు చూపించిన తర్వాతే ఆ స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం చూస్తున్న లడ్డూ తయారీ మొదలైంది. ఈ లడ్డూ తయారీకి ప్రత్యేక పద్దతి అంటూ ఒకటి ఉంది.

దిట్టం:-

వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకుల మోతాదును "దిట్టం" అంటారు. తొలిసారిగా తిరుమల తిరుపతి పాలక మండలి 1950లో దిట్టంను నిర్ణయించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని TTD అనుసరిస్తుంది. దీనినే పడితరం దిట్టం స్కేలుగా కూడా పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువులను "దిట్టం"గా ఉంచుతారు. ఆ విధంగా ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు సమకూర్చుతారు. వాస్తవానికి మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారు చేసే వారు దానికి అనుగుణంగా కావాల్సిన కిలోల్లో దిట్టాన్ని సమకూర్చేవారు. భక్తుల తాకిడి పెరిగిన తర్వాత అంటే 2001లో ఈ దిట్టంను సవరించారు. 2001 దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూలను ఇప్పటికీ తయారు చేస్తున్నారు. 5100 లడ్డూల తయారీకి గాను 803 కేజీల సరుకులు వాడతారు. అంటే 803 కేజీల వివిధ రకాల సరుకులతో 5100 లడ్డూలు తయారు చేస్తారు.

దిట్టంలో ఉండే సరుకుల వివరాలు:-

ఆవు నెయ్యి - 165 కిలోలు

శెనగపిండి -180 కిలోలు

చక్కెర - 400 కిలోలు

యాలకులు - 4 కిలోలు

ఎండు ద్రాక్ష - 16 కిలోలు

కలకండ - 8 కిలోలు

ముంతమామిడి పప్పు - 30 కిలోలు

ఇలా ఒక దిట్టం నుంచి సుమారు 5100 లడ్డూలను తయారు చేస్తున్నారు. తొలినాళ్లలో ఈ లడ్డూను కట్టెల పొయ్యి మీద చేశారు. అయితే పొగ, కట్టెల కొరతను దృష్టిలో ఉంచుకుని పొయ్యిల స్థానంలో యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ లడ్డూ తయారీ పోటులో ఇప్పుడున్న అత్యాధునిక వంట సామాగ్రిని వినియోగించి రోజూ లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.

Comments

-Advertisement-