-Advertisement-

Scrap: 15 ఏళ్లు దాటిన వాహనాలు తక్కుకిందకే

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs notifications
Peoples Motivation

Scrap: 15 ఏళ్లు దాటిన వాహనాలు తక్కుకిందకే

• ముసాయిదా సిద్ధం చేస్తున్న ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల మేరకు నిర్ణయం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs notifications

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025, జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్ కు పంపాలని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు.... అవసరమైన ఫిట్నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయితే... ఆ వాహనాలకు ఇకపై రిజిస్ట్రేషన్ చేయరు. రోడ్లపై తిరిగేందుకు ఆ వాహనాలకు అనుమతి ఉండదు. వెహికల్ ఫిట్నెస్ పరీక్షలో పాసయితే... గ్రీన్ ట్యాక్స్ చెల్లించి... మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడుపుకోవచ్చు. ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయిన వాహనాలు మాత్రం స్క్రాప్కే. అలా కాదని... ఆ వాహనాలను రోడ్డెక్కిస్తే... అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో ప్రస్తుతం 15ఏళ్లు పైబడిన వాహనాలు 30లక్షలకు పైగా ఉన్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్లోనే 20 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 లక్షలు బైక్లు కాగా.. మూడున్నర లక్షల కార్లు, లక్ష గూడ్స్ క్యారేజీలు, 20వేల ఆటో రిక్షాలు ఉన్నాయి. రవాణా శాఖ ఇప్పటికే స్క్రాపేజ్ విధానానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి... ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే 15ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. అయితే.. కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తోపాటు అనేక రాష్ట్రాలు తెలంగాణ తరహాలోనే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి. దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులు స్క్రాప్ కు వెళ్లాల్సిన కేటగరిలో ఉన్నాయి. అంతేకాదు... దాదాపు 2వేల స్కూల్ బస్సులు కూడా 15ఏళ్లు పైబడినవే. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం పాత వాహనాల స్క్రాపింగ్ ను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీని పరిశీలిస్తోంది. పాత వాహనాలు తక్కుకు ఇచ్చేసి.. కొత్త వాహనాలను కొనుగోలు చేసే క్రమంలో... మోటారు వాహనాల పన్నుపై 10 శాతం నుంచి 15 శాతం వరకు రాయితీని అందించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. స్క్రాపేజ్ విధానానికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే సమర్పించామని... రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని రవాణా శాఖ అంటోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత... ఈ విధానం అమల్లోకి వస్తుందని. వాహన స్క్రాపింగ్ ప్రారంభమవుతుందని ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. వాహనాల స్క్రాపింగ్ కోసం ఇప్పటికే మూడు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. కాలుష్య కారకమైన వాహనాలను, రోడ్డుపై నడిపేందుకు అర్హత లేని వాహనాలను తొలగించడమే తమ లక్ష్యమని అంటున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. ప్రభుత్వ శాఖలోని 15ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున వాహనాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆటో, మోటర్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. జీహెచ్ఎంసీలో ఆటో టిప్పర్లు, అంబులెన్సులు , పైరింజన్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రభుత్వ వాహనాలు పొగను వెదజల్లుతూ రోడ్లపై తిరుగుతున్నాయి. 15ఏళ్ల దాటిన ప్రైవేట్ వాహనాలను రద్దు చేసినట్టే... ప్రభుత్వ వాహనాలను కూడా స్క్రాప్ కు పంపాలని కోరుతున్నారు. 

రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి...

15ఏళ్లు దాటిన వాహనాలతో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్తోంది. 2022లో... 15 ఏళ్లు దాటిన వాహనాల వల్ల... రాష్ట్రంలో 1306 ప్రమాదాలు జరిగాయని తెలిపింది. ఆ ప్రమాదాల్లో 418 మంది మరణించగా... 1100 మందికిపైగా గాయపడ్డారని నివేదిక ఇచ్చింది. గూత ఆటోమొబైల్స్.. ముఖ్యంగా 15ఏళ్లు పైబడిన వాహనాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తు తుంటాయని రోడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. బ్రేక్ ఫెయిలవడం వంటివి ఎక్కువగా జరుగుతాయంటు న్నారు. అంతేకాదు క్లచ్లు కూడా గట్టిగా మారతాయి, గేర్లు మార్చడం కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు... వాహనం ఆగిపోతుంది. లేదా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక... వీలైనంత వరకు కాలం చెల్లిన వాహనాలు నడకవకపోవడమే ఉత్తమం అని రోడ్ సేఫ్టీ నిపుణులు అంటున్నారు..

Comments

-Advertisement-