RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 5 వేల పోస్టులకు నోటిఫికేషన్
RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 5 వేల పోస్టులకు నోటిఫికేషన్
• వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది...
• 5 వేల పోస్టులను ఏకకాలంలో భర్తీ చేయనున్నారు...
• మార్కుల ఆధారంగా ఎంపిక...
• ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు...
RRB: నిరుద్యోగులకు సువర్ణావకాశం. తాజాగా వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. 5 వేల పోస్టులను ఏకకాలంలో భర్తీ చేయనున్నారు. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే, మీరు మంచి జీతం పొందవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి పశ్చిమ రైల్వే పరిధిలోని డివిజన్/వర్క్షాప్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 5,066 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఉద్యోగాల్లో ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏ, ఎలక్ట్రిషియన్, వైర్ మ్యాన్ తదితర ట్రేడ్లను భర్తీ చేస్తారు. ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు Tenth అర్హతతో పాటు ITI ఉత్తీర్ణులై ఉండాలి. 15-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. Tenth మరియు ITI మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
మొత్తం పోస్ట్లు: 5066
పోస్ట్ల కేటగిరీ: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏ, ఎలక్ట్రిషియన్, వైర్ మ్యాన్ తదితర ట్రేడ్లు
అర్హత: అభ్యర్థులు టెన్త్ తో పాటు ITI ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. వయో సడలింపు నిబంధనలు ఆయా వర్గాలకు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: 10వ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుము: రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 23-09-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 22-10-2024
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇