-Advertisement-

Hydra, FTL, బఫర్ జోన్ అంటే ఏమిటి?

Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Hyderabad hydra news Hydra ftl buffer zone
Peoples Motivation

Hydra, FTL, బఫర్ జోన్ అంటే ఏమిటి?

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా బఫర్ జోన్, FTL అనే పదాలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్, FTL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health news health tips health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Health care news Hydra ftl buffer zone

FTL: 

ఎన్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్ఎఎల్ తెలియజేస్తుంది. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు. దీంతో చాలామంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్ టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్ఎఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ ఉండదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్టీఎల్, బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు.

బఫర్ జోన్: 

రెండూ లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సాగు మాత్రమే చేసుకోవచ్చు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.

అసలేంటీ హైడ్రా అంటే?

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరా వంటి అంశాల్లో హైడ్రాకు విధులు, బాధ్యతలు ఉన్నాయి.

Comments

-Advertisement-