Health Tips :ఆ ఆరోగ్య సమస్య ఉంటే వంకాయ తినకండి.. విషంతో సమానం..!
Health Tips: ఆ ఆరోగ్య సమస్య ఉంటే వంకాయ తినకండి.. విషంతో సమానం..!
కూరగాయలలో రారాజు వంకాయ.. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? ఇది అందించే రుచి, ఆరోగ్య ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు.. ఇది ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థ
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే లేదా జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటే.. మీరు వంకాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే వంకాయ మీ జీర్ణశక్తిని పాడు చేస్తుంది.
అలెర్జీ సమస్య
మీకు చర్మంపై చికాకు, దురద ఉంటే, మీరు వంకాయను తినకూడదు. సాధారణంగా స్కిన్ ఎలర్జీ ఉంటే వంకాయను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.. అది మీ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది..
డిప్రెషన్
డిప్రెషన్ లేదా యాంగ్జయిటీకి మాత్రలు వేసుకుంటున్నట్లయితే వంకాయ తినకండి.. అది మీ ఒత్తిడిని పెంచుతుంది. మాత్రల శక్తిని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత
రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు రక్తహీనత వస్తుంది. మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు వంకాయను ఎక్కువగా తినకూడదు.
కంటి సమస్యలు
చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వంకాయకు దూరంగా ఉండాలి. కంటి దురద, చికాకు, దృష్టి లోపం, కళ్ల చుట్టూ వాపు వంటి సమస్యలు ఉంటే వంకాయ తినకూడదు.
కిడ్నీ సమస్యలు
కిడ్నీ స్టోన్ ఉన్నవారు వంకాయను ముట్టుకోకూడదు. వంకాయలోని ఆక్సలేట్లు మీ రాతి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.