GSWS: ఈ సచివాలయం అంతే అంటున్న గ్రామ ప్రజలు
ఈ సచివాలయం అంతే అంటున్న గ్రామ ప్రజలు
సిబ్బంది సమయానికి రారు వచ్చినా ఉండరు అంటున్న ప్రజలు
అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టలేనంత బిజీగా సచివాలయ సిబ్బంది.
నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఎక్కడ..? ఎంపీడీఓ సార్
ప్యాపిలి, సెప్టెంబర్ 10 (పీపుల్స్ మోటివేషన్):-
ప్యాపిలి మండలం కలచట్ల గ్రామ సచివాలయంలో ఉండాల్సింది 11 మంది ఉన్నది ముగ్గురు, 11 మంది గాను సగం మంది కూడా లేరు. మిగిలిన వారు ఎక్కడికి వెళ్లారు ఎవరికీ తెలియదు వచ్చినవారు రిజిస్టర్లో సంతకాలు కూడా పెట్టలేదు అంటే సచివాలయానికి వచ్చినట్టా..?రానట్టా..? వస్తే సంతకాలు ఎందుకు పెట్టలేదు ఇది కలచట్ల పంచాయతీ సచివాలయం సిబ్బంది పనితీరు.. ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తే సచివాలయ ఉద్యోగులు ఇలా విధులు నిర్వహిస్తారా..? ప్రతిరోజు ఇదే తరహాలో సిబ్బంది పనితీరు ఉందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి ఎప్పుడొచ్చినా ఒక్కరిద్దరూ తప్ప మిగిలిన వారు ఉండటం లేదని చెబుతున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే కలచట్ల గ్రామంలోని సచివాలయంలో 11 మంది సిబ్బందికి గాను ముగ్గురు మాత్రమే ఉండడం ఆశ్చర్యం కలిగించింది. కనీసం సగం మంది కూడా లేకపోవడంతో అనేక రకాల పనులపై అక్కడికి వచ్చిన ప్రజలు వెనుదిరిగి వెళ్లారు. ఎవరు ఎక్కడికి వెళ్లారని విషయం తెలియడం లేదు.. ఎక్కడున్నారని విషయం తెలుసుకునేందుకు కనీసం మూమెంట్ రిజిస్టర్ లో కూడా ఎవరు సంతకాలు చేయలేదు. ముగ్గురు మాత్రం మూమెంట్ రిజిస్ట్రేషన్ లో ముగ్గురు మాత్రమే సంతకాలు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ ,మహిళా పోలీస్ సెలవులో ఉన్నట్లు తెలిపారు. మూమెంట్ రిజిస్టర్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్ సంతకాలు మాత్రం రాసి ఉన్నారు. వచ్చి వెళ్లిన వాళ్లు మాత్రం అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు కూడా పెట్టకుండా తమ మేధావితనం నిరూపించుకున్నారు. రిజిస్టర్లు సంతకాలు పెట్టలేనంత బిజీగా ఏం పని చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు అసలు సచివాలయానికి వచ్చారా రాలేదా వెళ్లిన వాళ్లు మూమెంట్ రిజిస్ట్రేషన్ లో వెళ్లేటప్పుడు రాసి వెళ్లాలని తెలియదా అని సిబ్బంది పనితీరుపై సహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఓపక్క నిత్యం మొత్తుకొని చెబుతున్న ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ప్రతి ఒక్కరిని కూడా విధుల నుండి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.రోజు 11:30కు వస్తారు 3:00గంటలకు వెళ్తారు ఎవరు కానీ సమయపాలన పాటించరు సచివాలయాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో గారిని కోరుతున్నాం.