-Advertisement-

Ganesh Chaturthi: పెళ్లి కార్డులపై గణేశుడి ఫొటోనే ఎందుకు పెడతారు..! చవితి రోజున చంద్రుని చేస్తే నిందలు తప్పేలా..!!

Vinayaka chaturthi images Vinayaka chaturthi quotes Ganesh Chaturthi wishes Vinayaka chaturthi significance Ganesh chaturthi importance Lord Vinayaka
Peoples Motivation

Ganesh Chaturthi: పెళ్లి కార్డులపై గణేశుడి ఫొటోనే ఎందుకు పెడతారు..! చవితి రోజున చంద్రుని చేస్తే నిందలు తప్పేలా..!!

Vinayaka chaturthi images Vinayaka chaturthi quotes Ganesh Chaturthi wishes Vinayaka chaturthi significance Ganesh chaturthi importance Lord Vinayaka

వినాయకుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైనది. ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించేందుకు పెళ్లిలో వినాయకుడికి పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు. హిందూ ఆచారాల ప్రకారం వినాయకుడికి పూజించడం చాలా ముఖ్యం. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించినా, ఇంటర్వ్యూకి వెళ్లిన, వివాహ సమయంలోనైనా ఆది దేవుడిలా భావించే విఘ్నేశ్వరుడిని పూజించాలనే నియమం ఉంటుంది.

పెళ్లి కార్డులపై గణేశుడి ఫొటో...

వినాయకుడికి వివేకం, జ్ఞానం ప్రసాదించే దేవుడిలా భావిస్తారు. అందుకే వివాహానికి సంబంధించిన అన్ని పనులను వివేకంతో చేస్తూ విజయం సాధించాలని గణపతిని పూజిస్తారు. లంబోదరుడు ఆదిపూజ్యుడు, విఘ్నలకధిపతి. వధూవరుల సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై గణేషుడి ఫొటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటారు. గణేశుడికి ఉన్న ఏనుగు తల ఒక వ్యక్తి తన ఆలోచన పరిధిని విస్త్రతపరుచుకోవాలని వివాహంలో ఎవరినీ అవమానించకూడదనే నిగూఢ విషయాలను తెలియజేస్తుంది.

చంద్రుని పరిహాసం..పార్వతీ దేవి శాపం..

ఒకనాడు వినాయకుడు తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కరించలేకపోతాడు. అది చూసిన చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు పార్వతీ దేవి చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు తప్పవని శపిస్తుంది. అయితే అది కేవలం చంద్రుడికి మాత్రమే కాదు లోకానికి శాపం తల్లీ అంటూ శాపవిముక్తి చెప్పమని చంద్రుడు వేడుకుంటాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు గణపతి పూజచేసి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంటే నిలాపనిందలు పోతాయని..అప్పుడు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని పార్వతీ దేవీ చెప్పడంతో భక్తులు అదే అనుసరిస్తున్నారు.

Comments

-Advertisement-