-Advertisement-

CTET: సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ctet.nic.in login CTET 2024 ctet.nic.in result CTET Result CTET full form CTET application form 2024 CTET Admit Card Jobs news SSC JOBS Latest jobs
Peoples Motivation

CTET: సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి ఏటా రెండుసార్లు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ(CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET- December 2024)కు నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్షను 2024 డిసెంబర్ 1న (ఆదివారం) నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. ఆంగ్లం/హిందీ భాషల్లో జరిగే ఈ పరీక్షకు అక్టోబర్ 16 రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.


 సీటెట్ నోటిఫికేషన్ లో ముఖ్యమైన సమాచారం 

• దేశవ్యాప్తంగా సీటెట్ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. సీటెట్ కు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

• అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపరు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపరు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

• ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

• సీటెట్ లో సాధించిన స్కోర్కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.

• మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.

• పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్ -1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు.

• దరఖాస్తుల్లో తప్పులను అక్టోబర్ 21 నుంచి 25వరకు సవరణ చేసుకోవచ్చు. హాల్టికెట్లను పరీక్షకు రెండు రోజుల ముందు విడుదల చేస్తారు. ఫలితాలు జనవరి నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

• ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

  మిగతా సమాచారం కోసం, ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


CTET Result 2024 ctet.nic.in login ctet.nic.in result CTET 2024 CTET full form CTET application form 2024 CTET Result 2024 July CTET Admit Card

Comments

-Advertisement-