CISF JOBS: CISF కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
CISF JOBS: CISF కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
మీరు ఇంటర్ పాసయ్యారా...
చక్కటి శారీరక దారుఢ్యం ఉందా..
మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..
అయితే ఈ ప్రకటన మీ కోసమే...
కేంద్ర హోం శాఖ పరిధిలోని సీఐఎస్ఎఫ్..
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు
• సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ సంస్థ కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. దేశం లోని ప్రభుత్వ సంస్థలకు భద్రత కల్పించడానికి దీన్ని స్థాపించారు. 1969లో పార్లమెంట్ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటుచేశారు. తర్వాత దీన్ని 1983లో పార్లమెంట్ చట్టం ద్వారా సాయుధ దళంగా మార్చారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సుమారు 1,88,000 మంది దీనిలో పనిచేస్తున్నారు.
మొత్తం ఖాళీలు: 1130
పోస్టులు: కానిస్టేబుల్/ఫైర్ (పురుషులు)
వీటిలో తెలంగాణలో- 26, ఏపీ- 32 పోస్టులు ఉన్నాయి.
పే స్కేలు: రూ. 21,700-69,100/-
ఎవరు అర్హులు:
గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ (సైన్స్) గ్రూప్లో ఉత్తీర్ణత. నుంచి ఇంటర్
వయస్సు: 2024, సెప్టెంబర్ 30 నాటికి 18-23 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2001, అక్టోబర్ 1 నుంచి 2006, సెప్టెంబర్ 30 మధ్య జన్మించిన వారు అర్హులు.
గమనిక: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: కనీసం 170 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ 80-85 సెం.మీ ఉండాలి.
ఎంపిక విధానం
• పీఎస్, పీఈటీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, డీఎంఈ, వైద్యపరీక్షల ఆధారంగా చేస్తారు.
రాతపరీక్ష విధానం
• ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
• పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జీకే అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లిష్/ హిందీ నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులు.
• పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు
• ప్రశ్నపత్రం ఇంగ్లిష్/ హిందీలో ఉంటుంది
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 30
మరింత సమాచారం కోసం ఇక్కడ లింకు పై క్లిక్ చేయండి