ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే జీతాలు!
ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్... ఆస్తుల వివరాలు వెల్లడిస్తేనే జీతాలు!
• నిబంధనలు పాటించని 2.44 లక్షలకు పైగా ఉద్యోగులు
• వారి నెల జీతం ఆపేసిన ప్రభుత్వం
• తమ ఆస్తుల వివరాలు నమోదు చేయాలని యూపీ గవర్నమెంట్ ఆదేశం
కొత్త ఆర్డర్ ప్రకారం, ఉద్యోగులు ఆగస్టు 31 లోగా మానవ సంపద పోర్టల్లో తమ చర, స్థిరాస్తుల వివరాలను అప్లోడ్ చేయాలి. శాఖల నివేదికల ఆధారంగా.. 2,44,565 మంది ఉద్యోగులు చివరి తేదీ దాటినా ఉత్తర్వులను పాటించలేదు. దీని కారణంగా వారి జీతాలు నిలిచిపోయాయి. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని ఉత్తర ప్రదేశ్ లోని 2 లక్షల 44 వేల 565 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది.
ఏంటి మానవ్ సంపద పోర్టల్...!
ఉత్తర ప్రదేశ్ లోని ప్రభుత్వ విభాగాల్లో 8 లక్షల 46 వేల 640 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్, పీసీఎస్ తరహాలో తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 31లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ముందుగానే.. అన్ని శాఖలకు లేఖ రాశారు. వివరాలు ఇవ్వకుంటే జీతం నిలిపివేస్తామని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయులతో పాటు కార్పొరేషన్లు, అటానమస్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను చేర్చలేదు. చీఫ్ సెక్రటరీ ఆదేశాల తర్వాత కూడా ఆస్తుల వివరాలు ఇవ్వడంలో ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. కేవలం 6.02 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే తమ ఆస్తులను వెల్లడించారు. సమాచారం ఇవ్వని ఉద్యోగులపై ఇప్పటికీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.