Awareness programme: గుడ్ టచ్ బాడ్ టచ్, మహిళా సంబంధిత నేరాలు, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ కిడ్నాపింగ్, సైబర్ క్రైమ్, లోన్ యాప్ మోసాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు
Awareness programme: గుడ్ టచ్ బాడ్ టచ్, మహిళా సంబంధిత నేరాలు, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ కిడ్నాపింగ్, సైబర్ క్రైమ్, లోన్ యాప్ మోసాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు
• రేపటి తరం పౌరుల శ్రేయస్సు కోరి ప్రస్తుత సమాజంలో ఉన్న పెనుభుతాల గురించి విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు.
• మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకై పాటుపడండి. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జీవించండి.
•సైబర్ క్రైం ఏ రూపంలో వస్తుందో తెలీదు... అప్రమత్తంగా ఉంటూ నివారించడమే ఉత్తమ మార్గం.
• రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగస్వాములు అవ్వండి.
• జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఏర్పేడు/బి ఎన్ కండ్రిగ పోలీసులు.
సమాజ సేవ, ప్రజాశేయస్సే పరమావధిగా భావించి ప్రస్తుత సమాజంలో పెను భూతాలుగా పరిణమిస్తున్న మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే అఘాయిత్యాలు వాటి నివారణ మార్గాలు, పోక్సో చట్టం దాని ఆవశ్యకత, రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకం యొక్క ఆవశ్యకతలను గురించి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి ఆదర్శవంతమైన నవ సమాజ నిర్మాణం కోసం జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ ఆధ్వర్యంలో అహర్నిశలు జిల్లా పోలీసులు పనిచేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., ఆదేశాల మేరకు శనివారం ఏర్పేడు/ బిఎన్ కండ్రిగ పోలిస్ వారు పాపానాయుడు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో జడ్.పి.హై స్కూల్ ప్రాంగణంలో సమావేశమై డ్రగ్స్, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, బాలికల సంరక్షణ చట్టం (ఫోక్సో చట్టం), సైబర్ క్రైమ్, రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు మొదలగు అంశాలపై పోస్టర్ను ప్రదర్శించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
బాలికలు, మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణ చర్యలు:-
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. బాలికలు మహిళలు ఏదైనా ఆపద సమయంలో డయల్ 100 లేదా 112 లేదా కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8099999977 లను సంప్రదించి పోలీసులు వారి సహాయాన్ని తక్షణమే పొందాలని సూచించారు. ఈ సృష్టికి మూలం ఒక స్త్రీ కాబట్టి అటువంటి స్త్రీలను కాపాడుకోవాల్సిన మహాతర బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాలు దుర్వినియోగం.. పర్యవసానాలు:-
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. ఒక్కసారి అలవాటు పడితే అవి మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తాయి. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా వ్యసనంతో ఇబ్బంది పడుతుంటే టోల్ ఫ్రీ నెంబర్ 14446 ను సంప్రదించి సహాయం పోరాలి. మీకు ఎవరికైనా మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 80999 99977 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సైబర్ నేరాలు:-
అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. మొబైల్ దొంగతనం, సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్ మోసాల గురించి వివరించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందస్తు జాగ్రత్తలను వివరించారు.
రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు:-
ద్విచక్ర వాహనంలో రేష్ డ్రైవింగ్ చేయకూడదని, లైసెన్సు లేకుండా లైసెన్స్ లేకుండా బండి నడవడం జరిమానా కట్టవలసి వస్తుందని, అని క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. రహదారిపై మీ కళ్ళ ముందు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ట్రాఫిక్ నియమాలను రహదారి భద్రత నియమాలను పాటించి మెరుగైన సమాజం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత:-
ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించండి. అది మీ జీవితాన్ని కాపాడుతుంది. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించవలసిన ఆవశ్యకతను వివరించారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి విపులంగా తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని వారి మాటలకు విలువనిచ్చి నడుచుకొని మీ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి, చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏర్పేడు/బి ఎన్ కండ్రిగ పోలీసులు, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.