-Advertisement-

AP GOVT: రాష్ట్రంలో 3,736 మద్యం షాపులకు నోటిఫికేషన్

AP liquor policy 2024 Ap new liquor policy 2024 price list New liquor policy in ap rates Ap new liquor policy 2024 price list pdf AP New Liquor rates
Peoples Motivation

AP GOVT: రాష్ట్రంలో 3,736 మద్యం షాపులకు నోటిఫికేషన్

• 2, 3 రోజుల్లో రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల...

• 3,736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల...

• 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు ప్రభుత్వం రిజర్వ్...

• నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం...

AP liquor policy 2024 Ap new liquor policy 2024 price list New liquor policy in ap rates Ap new liquor policy 2024 price list pdf AP New Liquor rates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తుంది. గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపిన వెంటనే 2, 3 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా చట్టం చేసింది. అయితే తాజాగా గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కెబినెట్ ఆమోదించింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు ప్రభుత్వం పంపనుంది. రేపటిలోగా గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలియజేయనున్నారు. మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు ప్రభుత్వం రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశం పైనా అబ్కారీ శాఖ కసరత్తు చేపట్టింది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా చేపట్టింది. వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటుంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ రిజర్వ్ చేయనుంది.

అందుబాటులోకి నాణ్యమైన మద్యం...

క్వార్టర్ మద్యం రూ. 99: ఇటీవలే నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని, నాణ్యమైన మద్యం అందుబాటులో ధరలో ఉండేలా కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రీమియర్‌ దుకాణాలు ఏర్పాటుకు తీర్మానం...

 కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 12 ప్రీమియర్‌ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. కొత్తగా ప్రీమియం స్టోర్లనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచిస్తోంది. తిరుపతిలో ప్రీమియర్‌ దుకాణానికి అనుమతివ్వలేదు. కొత్త మద్యం విధానం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించారు. లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తాం. రిజర్వుడు దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అన్‌ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్‌ ఫీజుల్లో 50 శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది. లైసెన్స్‌ ఫీజు నాలుగు శ్లాబులో రూ.50 నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. ప్రాఫిట్‌ 20% మార్జిన్‌. ప్రీమియం దుకాణాలకు లైసెన్స్‌ కాలపరిమితి ఐదేళ్లు. ఫీజు రూ.కోటి వరకు ఉంటుంది.

Comments

-Advertisement-