Anna Canteen: అక్కడ అన్న క్యాంటీన్లో 3 పూటల ఉచిత ఆహారం..ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు
Anna Canteen menu
Anna Canteen Timings
Anna Canteen ap gov in
Anna Canteen wikipedia
Anna Canteen Trust website
Anna canteen donation online
By
Peoples Motivation
Anna Canteen: అక్కడ అన్న క్యాంటీన్లో 3 పూటల ఉచిత ఆహారం..ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు
• రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో ఉచితంగా ఫుడ్..
• టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం..
• ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు..
• సంవత్సరం పాటు ఉచితంగా 3 పూటల ఆహారం అందిస్తాం..
• రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.. రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పర్యటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం అన్నారు.. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నాం అని తెలిపారు.. కొన్ని ప్రభుత్వాలు పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేశాయని దుయ్యబట్టిన ఆయన.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభిస్తున్నాం అన్నారు.. ఇక, రాయచోటిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ఏడాది పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తాం... ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి.
Comments