Aadhar Card: గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ వివరాలు ఇచ్చారా? అయితే ఇక అంతే..!
Aadhar Card: గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ వివరాలు ఇచ్చారా? అయితే ఇక అంతే..!
ఆధార్ కార్డ్ పౌరుల గుర్తింపులో కీలకంగా మారిన రోజులివి. అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కూడా ఆధార్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తు వరకు ఇలా ఎక్కడైనా ఆధార్ తప్పనిసరి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆధార్ ఉపయోగిస్తుండటం వల్ల దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమూ పొంచి ఉంటుంది. ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయితే అది చట్టపరమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. అందుకే ఆధార్‌ని రక్షించుకోవడం చాలా ముఖ్యం..
ఆధార్ కార్డు ఇస్తే జరిగే నష్టాలు..
కొత్త SIM కార్డ్ కొనడం, బ్యాంక్ ఖాతా తెరవడం, బీమా పాలసీ తీసుకోవడం వంటి వివిధ పనుల కోసం KYC (నో యువర్ కస్టమర్) పత్రాలను, ఆధార్ కార్డ్, PAN కార్డ్ వివరాలను పంచుకుంటాం. దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు బ్యాంక్ ప్రతినిధులు, బీమా ఏజెంట్లు, మార్కెటింగ్ సిబ్బందిలా వ్యవహరించే వ్యక్తులు ఆధార్‌ని దుర్వినియోగం చేయవచ్చు. ఇది సైబర్ నేరాలకు దారి తీస్తుంది. ఆధార్ కార్డులను జారీ చేసే ప్రభుత్వ సంస్థ UIDAI ఆధార్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. పొరపాటున షేర్ చేసినట్లయితే కార్డ్ దుర్వినియోగం కావడం పక్కా. అలా కాకుండా ఉండాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. అదే ఆధార్‌కు లాక్ వేయడం. ఫోన్లోనే మీ ఆధార్ కార్డ్‌ను లాక్ చేయడమెలాగో తెలుసుకోండి ఇలా..
>> UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
>> భాషని ఎంచుకుని, తదుపరి పేజీకి వెళ్లండి.
>> ఆధార్ సేవలను యాక్సెస్ చేయండి.
>> UIDAI హోమ్ పేజీలో, ఆధార్ సేవల విభాగాన్ని కనుగొనడానికి కిందకు స్క్రోల్ చేయండి.
>> దిగువన ఉన్న లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
>> లాకింగ్ దశలను అనుసరించండి
>> లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌పై నొక్కి, తదుపరి పేజీకి వెళ్లండి.
>> ఆధార్ కార్డ్‌ను లాక్ చేయడానికి వివిధ దశలను చూస్తారు.
>> వర్చువల్ ID నంబర్..
>> ఆధార్ కార్డ్‌ను లాక్ చేయడానికి ముందు, వర్చువల్ ID నంబర్ ఉండాలి. ఆధార్ కార్డ్ వర్చువల్ ID నంబర్‌ను రూపొందించడానికి లేదా తిరిగి పొందడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఇలా వివిధ దశలు అనుసరించాక ఆధార్ కార్డ్‌ను ఈజీగా లాక్ చేయవచ్చు. తద్వారా ఆధార్ సమాచారం దుర్వినియోగం కాదని నిపుణులు చెబుతున్నారు.