-Advertisement-

NMMS: స్కూల్ విద్యార్థులకు సువర్ణావకాశం..! ప్రతి నెలా స్కాలర్షిప్ ప్రోగ్రాం..!!

Nmms 2024 Nmms telugu NMMS AP NMMS Scholarship NMMS attendance NMMS login bse.ap.gov.in nmms Nmms scholarship results NMMS Scholarship apply online
Peoples Motivation

NMMS: స్కూల్ విద్యార్థులకు సువర్ణావకాశం..! ప్రతి నెలా స్కాలర్షిప్ ప్రోగ్రాం..!!

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Nmms 2024 Nmms telugu NMMS AP NMMS Scholarship NMMS attendance NMMS login bse.ap.gov.in nmms Nmms scholarship results NMMS Scholarship apply online

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2024-25

వివరాలు

ఏడాదికి రూ.12 వేల ఆర్థిక ప్రోత్సాహం: ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్షిప్ అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

అర్హతలు

• ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55శాతం మార్కులు పొంది ఉండాలి.

• ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.

• విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

ఎంపిక విధానం

రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్ కు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష

ఈ స్కాలర్షిప్స్కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్ష విధానం

మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్): 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్): 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. మొత్తం 90 మార్కులు. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్, సైన్స్, మ్యాథ్స్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

దరఖాస్తు విధానం

రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100(ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.50) ఎస్బీఐ చలానా రూపంలో జతచేయాలి.

దరఖాస్తు చేయు విధానం

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-08-2024.

దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభం: 05-08-2024.

సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 06-09-2024

పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-09-2024.

దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేది: 10-09- 2024.

డీఈవో లాగిన్లో దరఖాస్తు ఆమోదం పొందేందుకు చివరి తేదీ: 15-09-2024.

ముఖ్యాంశాలు

• పేద ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ పథకాన్ని అమలు చేస్తోంది.

• 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది.

• అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 6వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Online application

Comments

-Advertisement-