-Advertisement-

MonkeyPox Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌... భారత్‌లో పరిస్థితి ఏంటీ..?

Monkeypox treatment Monkeypox transmission Monkeypox rash pictures Monkeypox vaccine Is monkeypox deadly Monkeypox virus signs of Monkeypox WHO HEALTH
Peoples Motivation
MonkeyPox Virus: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌... భారత్‌లో పరిస్థితి ఏంటీ..?

MonkeyPox Virus: ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో జూనోటిక్‌ వైరల్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగో దేశంలో ఎంపాక్స్‌ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Monkeypox treatment Monkeypox transmission Monkeypox rash pictures Monkeypox vaccine Is monkeypox deadly Monkeypox virus signs of Monkeypox WHO HEALTH

MonkeyPox Virus: ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో జూనోటిక్‌ వైరల్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగో దేశంలో ఎంపాక్స్‌ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్‌ సోకిన వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. కాంగో ఆరోగ్యశాఖ మంత్రి రోజర్‌ కంబా ప్రకటన ప్రకారం.. ఇప్పటి వరకు 18వేల మందికిపైగా కేసులు రికార్డయ్యాయి. ఇందులో కనీసం 610 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. విస్తరిస్తున్న వైరస్ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైరస్‌ ప్రధానంగా లైంగిక సంబంధాలు, వైరస్‌ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉండడం, రోగులు వాడిన దుస్తులు వాడడం వల్ల వైరస్‌ సోకుతుందని నిపుణులు సూచించారు. కాంగోతో సహా అనేక దేశాల్లో కొత్త ఎంపాక్స్‌ స్ట్రెయిన్‌పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వైరస్‌ ఊహించినదానికంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, రూపంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 

అయితే, వైరస్‌ను సరిగ్గా ట్రాక్‌ చేసేందుకు అనువైన సౌకర్యాలు లేకపోవడం, వైరస్‌ తీవ్రత, వ్యాప్తి చెందుతున్న మార్గాలు వంటి ఎన్నో తిలయని విషయాలు ఉన్నాయని.. వీటన్నింటిపై మరోసారం అధ్యయనం నిర్వహించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంపాక్స్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ తర్వాత ఎంపాక్స్‌ కొత్త స్ట్రెయిన్‌, క్లాడ్‌ ఐబీ గుర్తించారు. ఇదే కేసుల పెరుగుదలకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

నైజీరియాలోని డెల్టా యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ ఎమర్జెన్సీ కమిటీ చైర్మన్‌ డాక్టర్ డిమి ఒగోయినా మాట్లాడుతూ ఆఫిక్రాలో ఎంపాక్స్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్న ఆయన.. వైరస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు. వైరస్‌ పరివర్తన, కొత్త స్ట్రెయిన్‌లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు అమెరికా, స్వీడన్‌, థాయ్‌లాండ్‌లో అనేక కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎంపాక్స్‌ ముప్పు నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. అనుమానిత కేసులను గుర్తిస్తే చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసింది. ఎంపాక్స్‌ కేసులను గుర్తించేందుకు, సరైన చికిత్స అందించేందుకు ఆరోగ్య నిపుణులకు కేంద్రం శిక్షణ కార్యక్రమాలను సైతం ప్రారంభించింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు కేసులు నమోదుకాకపోవడం ఊరటనిచ్చే విషయం
Comments

-Advertisement-