-Advertisement-

మతం ముసుగులో దేవుడు...ఈ మతంలో లేని ఆనందం వేరే మతంలో ఉందా..!

Breaking news General News Informative news telugu Telugu news updates Daily trending news Telugu Breaking news Telugu short news Important news
Peoples Motivation

మతం ముసుగులో దేవుడు 

ఈ మతంలో లేని ఆనందం వేరే మతంలో ఉందా..!

దేవుడు ఒక్కడే..... ఆఖరి అధ్యాయం భగవంతుడు వద్దకే

మతాలను ప్రోత్సహిస్తున్నది ఎవరు!!!

Breaking news General News  Informative news telugu Telugu news updates Daily trending news Telugu Breaking news Telugu short news Important news

మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గంలో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు అని ఒక భావన. అటువంటివి ఈనాడు ఒక మతంలో పుట్టి వేరే మతంలోకి వెళ్లడం అనేది ఎంత అరాచకం!!! వీటిని ప్రోత్సహిస్తున్నది ఎవరు!! నువ్వు హిందువుగా పుట్టావు హిందువుగానే పో ఏ మతమైనా మతానికి విలువలు ఉన్నాయి ఏ మతంలో పుట్టిన ఆ మతంలో నండే పోవాలి తప్ప అంతేగాని వేరే మతం లోకి వెళ్ళరాదు అని ప్రతి శాస్త్రంలో ఈ కథనం ఉంది!! వాటిని ఈనాడు కొంతమంది ప్రక్క త్రోవ పట్టిస్తున్నారు. ఈ మతంలో లేని ఆనందం వేరే మతంలో ఉందా!!! సాంప్రదాయాలకు విలువ లేకుండా చేస్తున్నారు! దేవుడు ఒక్కడే హిందువైనా ముస్లిం క్రీస్తు బౌద్ధమతం ఇస్లాం ఏ మతమైనా ఆఖరి అధ్యాయం ఆ భగవంతుడే!! ఈ భూమ్మీద ఎవరు శ్వాసతం కాదు . మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియలకు గంట సేపు ఆలస్యం అయితే గ్రామం ప్రజలు తరలించమని గొడవ చేస్తారు. ఎవరైనా ఆలోచిస్తారా నాతో మనతో ఇన్ని సంవత్సరాలు కలిసి మెలిసి బ్రతికాడు ఒక రోజేనా మృతదేహంతో స్నేహం చేస్తారా చేయరు అటువంటి దానికి ఎందుకు ఈ ఆరాటం మత పిచ్చి!!! కొంతమంది బోధకులు ఈ మధ్య కాలంలో మత మార్పిడి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రచారం బాగా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు:- మనం విశాఖపట్నం వెళ్లాలి అనుకుంటే కొంతమంది ద్విచక్ర వాహనం , కారు ఆటో లేక లారీ బస్సు ట్రైను ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా వారి యొక్క పరిస్థితులు బట్టి వెళ్తారు మన వెళ్లే గమ్యం ఒకచోటకే కానీ మార్గాలు వేరువేరు గా వెళ్తాం. అలాగే మనం కూడా ఏమైనప్పటికీ ఆఖరి క్షణం దేవుడు వద్దకే ఇటువంటి దానికి ఎందుకు భగవంతుని అడ్డుగా పెట్టుకుని మతమార్పిడి. ఇప్పటికైనా తెలుసుకోండి మత మార్పిడికి ప్రోత్సహించకండి సత్యమేవ జయతే!!!

Comments

-Advertisement-